![Yuki Bhambri, Albano Olivetti Pair Progressed To Chengdu Open Semifinals](/styles/webp/s3/article_images/2024/09/22/c.jpg.webp?itok=chebF5X1)
న్యూఢిల్లీ: భారత డబుల్స్ ఆటగాడు యూకీ బాంబ్రీ ఏటీపీ టోర్నీ చెంగ్డూ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూకీ బాంబ్రీ – ఫ్రాన్స్ ప్లేయర్ అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడి చక్కని పోరాట పటిమతో తమకన్నా మెరుగైనా ర్యాంకింగ్ ప్లేయర్లను కంగుతినిపించింది.
పురుషుల డబుల్స్‌లో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి జంట 5–7, 6–3, 12–10తో ఈక్వెడార్‌కు చెందిన గాంజాలొ ఎస్కోబార్–డీగో హిదాల్గొ జోడీపై చెటడోడ్చి గెలిచింది. ఆరంభ సెట్‌లో వెనుకబడిన భారత్–ఫ్రాన్స్ ద్వయం రెండో సెట్‌లో అసాధారణ ఆటతీరుతో ఈక్వెడార్ జంటకు ఏమాత్రం అవకాశమివ్వకుండా సెట్‌ను కైవసం చేసుకొంది. కీలకమైన ఆఖరి సెట్ ఊహించని విధంగా సాగింది.
ఇరు జోడీలు ధీటుగా ఆడటంతో ప్రతి పాయింట్ కోసం పెద్ద పోరాటం తప్పలేదు. చివరకు 12–10తో యూకీ బాంబ్రి జోడీ సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో భారత్–ఫ్రాన్స్ జోడీ... రెండో సీడ్ ఇవాండ్ డొడిగ్ (క్రొయేషియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జంటను ఎదర్కొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment