
అమెరికాలో జరిగిన లెక్సింగ్టన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ 3–6, 6–4, 10–8తోబ్రువెర్ (నెదర్లాండ్స్)–మెకగ్ (బ్రిటన్)లపై నెగ్గారు. ఈ ఏడాది సాకేత్–యూకీకిది నాలుగో ఏటీపీ చాలెంజర్ టైటిల్. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 46 వేలు) లభించింది.
Comments
Please login to add a commentAdd a comment