టైటిల్‌ పోరుకు యూకీ–అల్బానో జోడీ  | Yuki Bhambri qualified for the doubles title | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు యూకీ–అల్బానో జోడీ 

Published Sat, Apr 20 2024 3:56 AM | Last Updated on Sat, Apr 20 2024 3:56 AM

Yuki Bhambri qualified for the doubles title - Sakshi

మ్యూనిక్‌: భారత టెన్నిస్‌ అగ్రశ్రేణి క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్‌లో మూడోసారి ఏటీపీ –250 టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. బీఎండబ్ల్యూ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో యూకీ  బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది.

శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి జంట 6–1, 6–7 (5/7), 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఎర్‌లెర్‌–మెడ్లెర్‌ (ఆ్రస్టియా) ద్వయంపై గెలిచింది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో–ఫ్రెంచ్‌ జోడీ ఏడు ఏస్‌లు సంధించి నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement