'మైఖెల్ చంపాడు.. నేను అండగా ఉన్నాను' | News Digest: Mikhail killed Sheena; I was only shielding him, Indrani told Peter in jail | Sakshi
Sakshi News home page

'మైఖెల్ చంపాడు.. నేను అండగా ఉన్నాను'

Published Mon, Mar 7 2016 9:36 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

'మైఖెల్ చంపాడు.. నేను అండగా ఉన్నాను'

'మైఖెల్ చంపాడు.. నేను అండగా ఉన్నాను'

ముంబయి: తన కుమార్తె షీనాబోరాను తన మాజీ భర్త మైఖెల్ హత్య చేశాడని, ఆ సమయంలో తాను సహాయం మాత్రమే చేశానని ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా భర్త పీటర్ ముఖర్జియాకు తెలిపినట్లు తెలిసింది. దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణిని 2015 ఆగస్టులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో ఆమె నేరాన్ని అంగీకరించలేదు. జైలుకు తీసుకెళ్లిన తర్వాత పీటర్ ఓసారి ఆమెను జైలులో కలిశారు. ఆ సమయంలో తాను ఆ హత్య చేయలేదని, మైఖెలే చేశాడని, మృతేదేహాన్ని కనిపించకుండా చేసేందుకే సహాయపడినట్లు ఆయనతో చెప్పారని పీటర్ సోదరుడు గౌతమ్ ముఖర్జియా తెలిపారు. అనవసరంగా తన సోదరుడు పీటర్ను ఈ కేసులో ఇరికించారని, 250 ఆధారాలు ఉన్నా అందులో ఏ ఒక్కటీ పీటర్ పాత్ర ఉందని రుజువు చేయలేకపోతున్నాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement