గువాహతి: 'నాసోదరి తర్వాత మా అమ్మ నన్నే టార్గెట్ చేసేదేమో. ఆ తర్వాత నన్నే చంపేసేదేమో' అని కూతురు హత్యకు పాల్పడి కటకటాలపాలైన మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జియా కుమారుడు మిఖైల్ బోరా అన్నాడు. ఇంద్రాణి అరెస్టు నేపథ్యంలో గువాహతిలో మీడియాతో మాట్లాడారు.
'నాకు తెలియదు. 2012లో మా సోదరి షీనా బోరాను హత్య చేసిన తర్వాత బహుషా నన్నే టార్గెట్ పెట్టుకొని చంపేసేదేమో. ఆ రోజు నన్ను పిలిచింది. కానీ నేను రావడం కుదరదని చెప్పాను. ఆమె చాలా శక్తిమంతురాలు. ఏమనుకుంటే అది చేయగలదు' అని పేర్కొన్నాడు. ఈ కేసు దర్యాప్తుకు సహాయపడేందుకు ముంబయికి వెళ్లాలని ఉంది. కాని ఒంటరిగా వెళ్లడం భయంగా ఉంది. మా తాతయ్యఅమ్మమ్మల బాధ్యతలు చూసుకునేందుకు అసోం ప్రభుత్వం ఇద్దరు నర్సులను ఏర్పాటుచేయగలిగితే వెళ్లగలను' అని చెప్పాడు. సొంత కూతురు షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసిన విషయం తెలిసిందే.
తర్వాత అమ్మ నన్నే చంపేసేదేమో..
Published Thu, Aug 27 2015 4:49 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM
Advertisement
Advertisement