Mikhail Bora
-
వాడు నా కన్నకొడుకు కాడు
రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న షీనాబోరా హత్యకేసులో తాజాగా మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. అసలు మిఖాయిల్ తన సొంత కొడుకు కానే కాదని, అతడు తన దత్తపుత్రుడని ఇంద్రాణి ముఖర్జీ తన న్యాయవాదులకు తెలిపింది. అయితే, షీనాబోరా కన్నతండ్రినని చెబుతున్న సిద్దార్థ దాస్ చెబుతున్న విషయాలకు మాత్రం ఇది పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. ఆయన ఇటీవలే కోల్‌కతాలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో లాయర్లు మళ్లీ తల పట్టుకున్నారు. నిన్న మొన్నటివరకు మిఖాయిల్ అనే వ్యక్తి ఇంద్రాణి కొడుకని అంతా అనుకుంటూ ఉన్నారు. తన చెల్లి చాలా కష్టాలు పడిందని గతంలో మిఖాయిల్ చెప్పిన విషయం తెలిసిందే. చెల్లెలి తర్వాత తనను చంపేయాలనుకుంటోందని, తానే ఆమె తదుపరి టార్గెట్ అని కూడా అతడు అన్నాడు. ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ కలిసి 2012 ఏప్రిల్ 24వ తేదీన షీనాబోరాను గొంతు పిసికి చంపేసి, తర్వాత ఆమెను కాల్చేశారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. -
ఇంద్రాణిని తీవ్రంగా కొడుతున్నారు !
ముంబయి: విచారణ సమయంలో పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని తీవ్రంగా కొడుతున్నారని ఆమె తరుపు న్యాయవాదులు సోమవారం ముంబయి కోర్టుకు ప్రధానంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె హత్య కేసుకు సంబంధించి పలు వివరణలు ఇచ్చినా సంతృప్తి చెందని పోలీసులు విచారణ పేరిట ఆమెను భౌతికంగా మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించనున్నట్లు సమాచారం. తాము ఆమెను కలిసేందుకు వెళ్లిన సమయంలో ఆమె ముఖంపై చెంపదెబ్బల గాయాలు వారికి కనిపించినట్లు తెలుస్తోంది. సొంత కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఆమె కుమారుడిని కూడా హత్య చేసేందుకు ఆమె అదే రోజు పలురకాల కుట్రలకు పాల్పడిందని కూడా తెలిసింది. గతంలో పోలీసులు కోరిన కస్టడీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆ గడువు మరింత కోరేందుకు మరోసారి ఆమెను సోమవారం కోర్టుకు పోలీసులు హాజరుపరచనున్నారు. -
అమ్మ నన్ను కూడా చంపేసేదేమో!?
-
అక్క పేరుతో విలువైన ఆస్తులున్నాయే..
-
అమ్మ నన్ను కూడా చంపేసేదేమో!?
షీనా హత్య కేసులో ఇంద్రాణి కొడుకు అనుమానం * గువాహటిలో మిఖైల్, కోల్‌కతాలో ఖన్నా... * ముంబైలో ఇంద్రాణి, రాహుల్‌ల ఇంటరాగేషన్ * హత్య చేయాల్సిన ప్రదేశంలో ముందే రెక్కీ నిర్వహించిన ఇంద్రాణి గువాహటి/ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు విచారణ ఊపందుకుంది. గువాహటిలో షీనా సోదరుడు మిఖైల్‌ను, కోల్‌కతాలో నిందితురాలు ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, ముంబైలో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కొడుకు రాహుల్‌ను పోలీసులు గురువారం రోజంతా విచారించారు. విచారణలో రకరకాల కోణాల్లో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన సోదరిని హత్య చేసిన తల్లి.. తరువాత తనను కూడా చంపేసేదేమోనని ఆమె కుమారుడు మిఖైల్ బోరా గువాహటిలో అన్నాడు. పోలీసులు ముంబైకి పిలిస్తే ఈ కేసులో వారికి పూర్తిగా సహకరిస్తానని.. కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలను సమర్పిస్తానన్నాడు. ‘అమ్మ చాలా శక్తిమంతురాలు.. తాను ఏమైనా చేయగలదు’ అని అన్నాడు. తన పాన్ కార్డ్‌ను, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాలని తల్లి తనను అడిగిందని. అయితే తాను ఇవ్వకుండా నిరాకరించానన్నాడు. ఆ తరువాత ముంబై నుంచి వచ్చిన ఓ పోలీసు అధికారి మిఖైల్‌ను అతని ఇంట్లోనే గంటపాటు విచారించారు. హత్యకుకారణమేంటో తెలుసు: మారియా ఇటు ముంబైలో షీనా హత్య కేసు విచారణలో గురువారం ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా రంగంలోకి దిగారు. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్‌ని రాకేశ్ స్వయంగా ఇంటరాగేట్ చేశారు. షీనా బోరాను స్వయంగా ఆమె తల్లే చంపడానికి కారణమేమిటనేది తమకు తెలుసని, అయితే కోల్‌కతాలో అరెస్టు చేసిన మూడో నిందితుడు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండోభర్త) ఇంకా ముంబైకి చేరుకోలేదని, ఆయనను కూడా విచారించాకే జరిగిందేమిటో వెల్లడిస్తామని రాకేశ్ గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అటు కోల్‌కతాలో ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు గురువారం విచారించా రు. హత్య జరిగిన తీరు మాత్రం సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ ఎస్పీరాయ్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. దీని ప్రకారం ‘షీనా హత్య జరిగిన ఏప్రిల్ 24, 2012కు ముందు రోజే సంజీవ్‌ఖన్నా కోల్‌కతా నుంచి ముంబైకి వచ్చాడు. ఏప్రిల్ 23న ఇంద్రాణి రాయ్‌గఢ్ తాలూకాలోని అటవీప్రాంతానికి వెళ్లి అక్కడ రెక్కీ నిర్వహించింది. ఏప్రిల్ 24లో ముంబైలోని ఓ హోటల్ గదిలో షీనాకు మద్యం తాగించి, తరువాత కారులోకి బలవంతంగా ఎక్కించి.. హైవేపై తీసుకెళ్తూ మార్గమధ్యంలోనే గొంతు నులిమి చంపేశారు. ఆ తరువాత ముందురోజు తాము ఎంపిక చేసుకున్న అటవీ ప్రాంతంలో ఆమె శవాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఏప్రిల్ 25న విమానం ద్వారా సంజీవ్‌ఖన్నా తిరిగి కోల్‌కతా వెళ్లిపోయాడు.’ మరోవైపు పీటర్ కుమారుడు రాహుల్‌ను దాదాపు 12 గంటల పాటు పోలీసులు విచారించారు. షీనాది పరువు హత్యా? లేక ఆర్థిక వ్యవహారమా? అన్నది తేలాల్సి ఉంది. తండ్రి స్థానంలో తాతపేరు కూతురు షీనా బోరా బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరు స్థానంలో ఇంద్రాణి ముఖర్జీ ఎవరి పేరు రాయించారో తెలుసా? తన సొంత తండ్రి పేరును. ఉపేంద్ర కుమార్ బోరా...ఇంద్రాణికి తండ్రి. అయితే మనవరాలు షీనా బర్త్ సర్టిఫికెట్లో కూడా తండ్రిగా ఈయన పేరే ఉంది. 80 ఏళ్ల ఉపేంద్ర కుమా ర్ బోరా గురువారం స్పందిస్తూ... ‘షీనా నా కూతురు కాదు, మనవరాలు’ అని చెప్పారు. సిద్ధార్థ్ దాస్(ఇంద్రాణి మొదటిభర్త) షీనా తండ్రి అని తెలిపారు. అయితే సిద్ధార్థ్ కూడా షీనా తండ్రి కాకపోవచ్చని, షిల్లాంగ్ వాసి ద్వారా ఇంద్రాణి ఆమెను కన్నదనే వార్తలపై స్పందిస్తూ... వాస్తవమేంటో తేలాలన్నారు. -
షీనా బోరా సోదరుడు అరెస్టు
గువాహతి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో అరెస్టు జరిగింది. హత్యకు పాల్పడిన ఇంద్రాణి ముఖర్జియా కుమారుడు, షీనాబోరా సోదరుడు మిఖైల్ బోరాను పోలీసులు దిస్పూర్లో అదుపులోకి తీసుకున్నారు. తొలుత ప్రాథమిక విచారణ కోసం స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు కొద్ది సేపు ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేశారు. 2012లో షీనా బోరాను ఆమె కన్నతల్లి ఇంద్రాణి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సమగ్ర సమాచారం కోసం షీనా బంధువులను, కుటుంబీకులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు. -
తర్వాత అమ్మ నన్నే చంపేసేదేమో..
గువాహతి: 'నాసోదరి తర్వాత మా అమ్మ నన్నే టార్గెట్ చేసేదేమో. ఆ తర్వాత నన్నే చంపేసేదేమో' అని కూతురు హత్యకు పాల్పడి కటకటాలపాలైన మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జియా కుమారుడు మిఖైల్ బోరా అన్నాడు. ఇంద్రాణి అరెస్టు నేపథ్యంలో గువాహతిలో మీడియాతో మాట్లాడారు. 'నాకు తెలియదు. 2012లో మా సోదరి షీనా బోరాను హత్య చేసిన తర్వాత బహుషా నన్నే టార్గెట్ పెట్టుకొని చంపేసేదేమో. ఆ రోజు నన్ను పిలిచింది. కానీ నేను రావడం కుదరదని చెప్పాను. ఆమె చాలా శక్తిమంతురాలు. ఏమనుకుంటే అది చేయగలదు' అని పేర్కొన్నాడు. ఈ కేసు దర్యాప్తుకు సహాయపడేందుకు ముంబయికి వెళ్లాలని ఉంది. కాని ఒంటరిగా వెళ్లడం భయంగా ఉంది. మా తాతయ్యఅమ్మమ్మల బాధ్యతలు చూసుకునేందుకు అసోం ప్రభుత్వం ఇద్దరు నర్సులను ఏర్పాటుచేయగలిగితే వెళ్లగలను' అని చెప్పాడు. సొంత కూతురు షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసిన విషయం తెలిసిందే.