సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్య కేసు సినిమా ట్విస్ట్ను మించి ఊహించని మలుపులు తిప్పుతోంది. పోలీసుల విచారణలో తవ్విన కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా షీనా సోదరుడు, ఇంద్రాణీ ముఖర్జీయా కొడుకు మిఖైల్ బోరా గురువారం మీడియా ముందుకు వచ్చాడు. తన సోదరి షీనా గురించి తల్లిని ఎన్నోసార్లు అడిగానని, అక్క పేరుతో పాటు తన పేరుమీద విలువైన ఆస్తులు ఉన్నాయని, బహుశా హత్యకు అవే కారణాలు కావొచ్చని మిఖైల్ తెలిపాడు. షీనా, పీటర్ ముఖర్జీయా కలిసి ఉన్న కొన్ని ఫోటోలతో పాటు, కొన్ని సంభాషణలు తన దగ్గర ఉన్నాయని అతడు వెల్లడించాడు.