అక్క పేరుతో విలువైన ఆస్తులున్నాయే..
న్యూఢిల్లీ : సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్య కేసు సినిమా ట్విస్ట్‌ను మించి ఊహించని మలుపులు తిప్పుతోంది. పోలీసుల విచారణలో తవ్విన కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా షీనా సోదరుడు, ఇంద్రాణీ ముఖర్జీయా కొడుకు మిఖైల్ బోరా గురువారం మీడియా ముందుకు వచ్చాడు. తన సోదరి షీనా గురించి తల్లిని ఎన్నోసార్లు అడిగానని, అక్క పేరుతో పాటు తన పేరుమీద విలువైన ఆస్తులు ఉన్నాయని, బహుశా హత్యకు అవే కారణాలు కావొచ్చని మిఖైల్ తెలిపాడు. షీనా, పీటర్ ముఖర్జీయా కలిసి ఉన్న కొన్ని ఫోటోలతో పాటు, కొన్ని సంభాషణలు తన దగ్గర ఉన్నాయని అతడు వెల్లడించాడు.
కాగా నా సోదరిని తల్లే హత్య చేసిందని నేను నమ్ముతున్నా. అందుకు సంబంధించి పూర్తి కారణాలు నాకు తెలుసు. ఒక కారణం అయితే కాదు. చాలా కారణాలే ఉన్నాయి. ఆమె నేరాన్ని అంగీకరించని పక్షంలో.. నేను ఏది చేయాల్సిన అవసరం వస్తుందో అది కచ్చితంగా చేస్తా.ఆగస్టు 31 వరకూ ఇంద్రాణికి పోలీస్ కస్టడీ విధించారు. వారి విచారణలో అమ్మ నేరాన్ని ఒప్పుకోకపోతే హత్య గల కారణాలను చెబుతా'అని మిఖైల్ బోరా తెలిపాడు.
మరోవైపు షీనా బోరా బాయ్‌ఫ్రెండ్ రాహుల్ ముఖర్జీయాను కూడా పోలీసులు మరోసారి ప్రశ్నించారు. ఈ కేసులో అతడిని నిన్న కూడా రాత్రి విచారించారు. కాగా షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జీయా చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే.