వాడు నా కన్నకొడుకు కాడు | latest twitst in sheena bora case, Mikhail my adopted son, says Indrani | Sakshi
Sakshi News home page

వాడు నా కన్నకొడుకు కాడు

Published Wed, Sep 2 2015 6:42 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

వాడు నా కన్నకొడుకు కాడు

వాడు నా కన్నకొడుకు కాడు

రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న షీనాబోరా హత్యకేసులో తాజాగా మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. అసలు మిఖాయిల్ తన సొంత కొడుకు కానే కాదని, అతడు తన దత్తపుత్రుడని ఇంద్రాణి ముఖర్జీ తన న్యాయవాదులకు తెలిపింది. అయితే, షీనాబోరా కన్నతండ్రినని చెబుతున్న సిద్దార్థ దాస్ చెబుతున్న విషయాలకు మాత్రం ఇది పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. ఆయన ఇటీవలే కోల్కతాలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

దాంతో లాయర్లు మళ్లీ తల పట్టుకున్నారు. నిన్న మొన్నటివరకు మిఖాయిల్ అనే వ్యక్తి ఇంద్రాణి కొడుకని అంతా అనుకుంటూ ఉన్నారు. తన చెల్లి చాలా కష్టాలు పడిందని గతంలో మిఖాయిల్ చెప్పిన విషయం తెలిసిందే. చెల్లెలి తర్వాత తనను చంపేయాలనుకుంటోందని, తానే ఆమె తదుపరి టార్గెట్ అని కూడా అతడు అన్నాడు. ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ కలిసి 2012 ఏప్రిల్ 24వ తేదీన షీనాబోరాను గొంతు పిసికి చంపేసి, తర్వాత ఆమెను కాల్చేశారని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement