షీనా కేసులో అప్రూవర్గా కారు డ్రైవర్
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన సాక్షి.. హంతకుల్లో ఒకరు అప్రూవర్గా మారాడు. అందుకు కోర్టు సోమవారం అనుమతినిచ్చింది. కన్న కూతురైన షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా ఆమె మాజీ భర్త, డ్రైవర్ కలిసి దారుణంగా గొంతునులిమి చంపిన విషయం తెలిసిందే.
అయితే, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులందరినీ జైలులో వేసి విచారిస్తుండగా ఇంద్రాణి కారు డ్రైవర్ అయిన శ్యామ్వర్ రాయ్ మొత్తం నిజాలు చెప్పేందుకు ముందుకొచ్చాడు. ఈ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు తనకు తెలుసని, అప్రూవర్ గా మారిపోతానని అందుకు అవకాశం ఇవ్వాలని గత నెలలో కోర్టుకు అభ్యర్థించుకున్నాడు. దీంతో సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా కూడా ఇప్పటికే జైలులో ఉన్న విషయం తెలిసిందే.