Shyamvar Rai
-
పెట్రోల్ పోసేముందు లిప్‌స్టిక్ పెట్టి జుట్టుకట్టింది
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జియా డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ దిమ్మతిరిగే విషయాలు చెప్పాడు. షీనాను ఇంద్రాణి ఎలా చంపేశారో పూసగుచ్చినట్లు ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు. షీనాను గొంతునులిమి చంపిన తర్వాత ఇంద్రాణి ఆమె ముఖంపై కూర్చుని 'ఇదిగో నీ ఫ్లాట్ ఇక్కడే ఉంది. ఇక జరిగిన విషయాలు ఎవరితో చెప్పకు.. చెబితే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని ఇంద్రాణి బెదిరించినట్లు వివరించాడు. షీనా బోరా కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్, ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్‌ఖన్నాను అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం నాటి విచారణ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో షీనాను హత్య చేసిన విధానం వివరించాడు. 'ఏప్రిల్ 24, 2012న షీనాబోరాను కారులో తీసుకెళ్లాం. దారిలో మెడిసిన్ కాక్ టెయిల్, ఆల్కహాల్ ఇచ్చాం. సరిగ్గా అప్పుడు ఇంద్రాణి ఆమెకు ఎదురుగా కూర్చుంది. వెనుకాలే కూర్చున్న ఇంద్రాణి మాజీ భర్త షీనా జుట్టును గట్టిగా పట్టుకోగా ఒక్కసారిగా ఇంద్రాణి ఆమె గొంతును నులిమింది. దీంతో ఆర్తనాదాలు చేసే ప్రయత్నం చేస్తుండగా నేను నోరు మూశాను. ఆ సమయంలో ఆమె నా బొటన వేలిని కొరికింది. కొద్ది సేపట్లోనే ఆమె ప్రాణం పోయింది. ఆ తర్వాత ఆమె మృతదేహంతో వెళ్లే సమయంలోనే కారులో షీనా ముఖంపై కూర్చున్న ఇంద్రాణి 'ఇదిగో ఇక్కడే ఉంది నీ ఫ్లాట్' అంటూ నాకు ఇవ్వాల్సిన ఫ్లాట్‌ను గుర్తు చేసింది. అనంతరం అడవిలోకి వెళ్లాం. ఆ సమయంలో షీనా పెదాలకు లిప్‌స్టిక్ రాసి జుట్టుకట్టింది. ఆ తర్వాత పెట్రోల్పోయగా ఆమె నిప్పంటించింది. వెంటనే తిరిగొచ్చి దారిలో కాఫీ తాగాం. అప్పుడే ఈ విషయం మర్చిపోవాలని నాకు వార్నింగ్ ఇచ్చారు' అని శ్యామ్వర్ రాయ్ కోర్టుకు వివరించాడు. -
'ముగ్గురం కలిసి ఆమెను చంపేశాం'
ముంబై: సొంత కూతురు షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసిందని అప్రూవర్‌గా మారిన డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ వెల్లడించాడు. ఇంద్రాణికి తాను, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహకరించామని ఒప్పుకున్నాడు. 2012, ఏప్రిల్ 24న కారులో షీనాకు చంపినట్టు తెలిపాడు. తాను షీనా నోరు మూసేయగా, ఖన్నా ఆమె జట్టు పట్టుకుని కదలకుండా పట్టుకున్నాడని చెప్పాడు. ఇంద్రాణి తన చేతులతో షీనా గొంతు పిసికేసిందని వెల్లడించాడు. పీటర్ ముఖర్జియా ప్రమేయం గురించి అతడు ఏమీ వెల్లడించలేదు. అయితే ఆయనకు ఎటువంటి సంబంధం లేదని పీటర్ తరపు న్యాయవాది మిహిర్ గీవాలా వాదించారు. 2012, ఏప్రిల్ 24న షీనా హత్యకు గురైనట్టు పోలీసులు పేర్కొన్నారు. అక్రమ ఆయుధాల కేసులో శ్యామ్వర్ రాయ్ అరెస్ట్ కావడంతో 2015లో ఈ దారుణోదంతం వెలుగు చూసింది. షీనా హత్య కేసులో రాయ్, ఇంద్రాణి, ఖన్నాను గతేడాది ఆగస్టులో అరెస్ట్ చేశారు. నవంబర్ లో పీటర్ ముఖర్జియాను అదుపులోకి తీసుకున్నారు. దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన సాక్షి.. హంతకుల్లో ఒకరు అప్రూవర్‌గా మారాడు. అందుకు కోర్టు సోమవారం అనుమతినిచ్చింది. కన్న కూతురైన షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా ఆమె మాజీ భర్త, డ్రైవర్ కలిసి దారుణంగా గొంతునులిమి చంపిన విషయం తెలిసిందే. -
షీనా కేసులో అప్రూవర్‌గా కారు డ్రైవర్
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన సాక్షి.. హంతకుల్లో ఒకరు అప్రూవర్‌గా మారాడు. అందుకు కోర్టు సోమవారం అనుమతినిచ్చింది. కన్న కూతురైన షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా ఆమె మాజీ భర్త, డ్రైవర్ కలిసి దారుణంగా గొంతునులిమి చంపిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులందరినీ జైలులో వేసి విచారిస్తుండగా ఇంద్రాణి కారు డ్రైవర్ అయిన శ్యామ్వర్ రాయ్ మొత్తం నిజాలు చెప్పేందుకు ముందుకొచ్చాడు. ఈ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు తనకు తెలుసని, అప్రూవర్ గా మారిపోతానని అందుకు అవకాశం ఇవ్వాలని గత నెలలో కోర్టుకు అభ్యర్థించుకున్నాడు. దీంతో సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియా కూడా ఇప్పటికే జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
'ఆ హత్యలో నాకూ భాగం ఉంది.. నాకన్నీ తెలుసు'
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కీలక పురోగతి వైపు మళ్లింది. ఈ కేసులో కీలక నిందితుడు, ఇప్పటికే అరెస్టయి జైలులోనే ఉన్న విచారణ ఖైదీ.. ఇంద్రాణీ డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారాడు. కోర్టులో పలు నిజాలు చెప్పేందుకు అంగీకరించాడు. తాను ఇప్పటి వరకు చెప్పని అంశాలు ఇప్పుడు కోర్టు ముందు ఉంచుతానని అన్నాడు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసని, ఈ హత్యలో తాను కూడా ఒక భాగస్తుడినని తెలిపాడు. షీనా బోరాను గొంతునులిమి ఊపిరి ఆగకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు చెప్పాడు.