పీటర్కు లై డిటెక్షన్ పరీక్షకు అనుమతి
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియాకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులు శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్నారు. ఆయనకు నవంబర్ 30న ఈ పరీక్షలు చేసే అవకాశం ఉన్నట్లు సన్ని హిత వర్గాలు చెబుతున్నాయి.
పీటర్ ముఖర్జియాను షీనా బోరా హత్య కేసులో గత వారం రోజుల కిందటే సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇప్పటికే పలుమార్లు ఈ కేసుకు సంబంధించి కోర్టు అనుమతితో ప్రశ్నించినా సరైన విధంగా సమాధానాలు చెప్పకపోవడంతోపాటు విచారణకు సహకరించని నేపధ్యంలో ఆయనకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించి ఆమేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన భార్య షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా జైలులో ఉన్న విషయం తెలిసిందే.