న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ కేసు విచారణలో భాగంగా.. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ హైడ్రామా నడిచింది. కోర్టులోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. లిక్కర్ కేసులో కీలక విషయాలు రాబట్టాలంటే ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని వాదించింది. ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీ కోరింది.
లిక్కర్ కేసులో సోమవారం నాడు తీహార్ జైల్లోనే సీబీఐ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. బుధవారం ఉదయం తీహార్ జైలు అధికారులు ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం.. కేజ్రీవాల్‌ను సీబీఐ తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.
అయితే.. కేజ్రీవాల్‌ను ఇంకా అధికారికంగా అరెస్ట్ చేయని విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. దీంతో కోర్టు అనుమతి కోరారు సీబీఐ తరఫు లాయర్. అయితే.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి అందుకు అభ్యంతరం తెలిపారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ చేయాల్సిన అవసరానికి గల కారణాలను సీబీఐ, న్యాయమూర్తికి వివరించారు.
‘‘లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాలే కీలకం. ఆయన నివాసంలోనే మద్యం పాలసీ తయారైంది. సౌత్‌లాబీకి కేజ్రీవాల్ పూర్తిగా సహకరించారు. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ గోవా పర్యటనకు నగదును హవాలా మార్గంలో సమకూర్చారు. రూ.338 కోట్లు ేతులు మారినట్లు ఆధారాలున్నాయి. అందుకే ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది’’ అని సీబీఐ వాదించింది.
విచారణ జరుగుతున్న సమయంలో.. కేజ్రీవాల్ కళ్లు తిరుగుతున్నాయని, టీ-బిస్కెట్ కావాలని కోరారు. దీంతో ఆయన షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని నిర్ధారించుకున్న అధికారులు.. కోర్టు అనుమతితో ఆయన్ని మరో గదిలోకి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు.
#WATCH | Delhi CM and AAP National Convenor Arvind Kejriwal being produced at the Rouse Avenue Court by CBI for a hearing in the liquor policy case. pic.twitter.com/ruFdQNecu4
— ANI (@ANI) June 26, 2024
Comments
Please login to add a commentAdd a comment