ఇంద్రాణి, డ్రైవర్కు జ్యుడిషియల్ కస్టడీ
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, కారు డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్లకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో మరో నిందితుడు, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు పోలీస్ కస్టడీ పొడగించారు.
సోమవారం నాటితో నిందితులకు పోలీస్ కస్టడీ ముగియడంతో ముంబై పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఇంద్రాణి, కారు డ్రైవర్లను జైలుకు తరలించారు. సంజీవ్ ఖన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు ఖన్నాను కోల్కతా తీసుకువెళ్లనున్నారు.
ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో కూతురు షీనా బోరాను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో అనైతిక విషయాలు వెలుగుచూశాయి.