షీనా హత్య కేసు: అప్రూవర్ గా మారనున్న డ్రైవర్ | No objection to Indrani's driver turning approver: CBI to court | Sakshi
Sakshi News home page

షీనా హత్య కేసు: అప్రూవర్ గా మారనున్న డ్రైవర్

Published Mon, Jun 6 2016 4:18 PM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

No objection to Indrani's driver turning approver: CBI to court

ముంబై: షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారనున్నాడు. ఈ విషయాన్ని కోర్టుకు సీబీఐ తెలిపింది. తనకు క్షమాభిక్ష పెట్టాలని రాయ్ కోర్టుకు రాసిన రెండు పేజీల లేఖను అధికారులు కోర్టుకు అందజేశారు. అప్రూవర్ గా మారే నిర్ణయం తనదేనని, ఎవరూ తనపై ఒత్తిళ్లు తేవడం లేదని, జరిగిన విషయం మొత్తాన్ని కోర్టుకు తెలుపుతానని తనకు క్షమాభిక్ష పెట్టాలని రాయ్ లేఖలో కోరారు. గత నెల మే11న తాను అప్రూవర్ గా మారతానని రాయ్ కోర్టులో చెప్పిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగష్టులో రాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement