ముంబై : సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగుచూసింది. షీనాను హత్య చేసిన తర్వాత ఆమె పేరుతో ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. షీనాను హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణీ ముఖర్జియా అప్పటి తన వ్యక్తిగత కార్యదర్శి కాజల్ శర్మతో చెప్పి ఆ మెయిల్ ఐడీ క్రియేట్ చేయించారు.
తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణీ అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. రాజీనామా లేఖలో షీనాబోరా సంతకాన్ని ఫోర్జరీ చేశానని, ఇంద్రాణీ నుంచి తనకు ఎలాంటి తప్పుడు సంకేతాలు రాకపోవడంతో ఆ పని చేసినట్లు వెల్లడించారు. ఇంద్రాణీ దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్పా తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ స్కైప్ ఐడీ నుంచి కాల్స్ కూడా మాట్లాడినట్లు కోర్టులో వివరించారు.
2012 ఏప్రిల్‌లో షీనా బోరా హత్యకు గురికాగా, మూడేళ్ల అనంతరం 2015లో ముంబై పోలీసులు ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్ ముఖర్జీయాను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ తన వాంగ్ములంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment