![మరోసారి ఇంద్రాణిపై జైల్లోనే ప్రశ్నల వర్షం](/styles/webp/s3/article_images/2017/09/3/81448108776_625x300.jpg.webp?itok=jCLgarNd)
మరోసారి ఇంద్రాణిపై జైల్లోనే ప్రశ్నల వర్షం
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో నిందితులను మరోసారి విచారించేందుకు సీబీఐకి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా, మరో ఇద్దరు నిందితులను మరోసారి జైలులోనే సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
'మేం ఇంద్రాణిని, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, ఆమె డ్రైవర్ శ్యాం రాయ్ని మరోసారి జైలులోనే విచారించాలని అనుకుంటున్నాము' అని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అందుకు కోర్టు అనుమతిచ్చినట్లు చెప్పారు.