Sheena Bora case
-
ఎన్నో మలుపులు.. మరెన్నో చీకటి కోణాలు
అది దేశ వాణిజ్య నగరం ముంబై. 2012లో బయటపడ్డ ఓ నేరం.. దేశం మొత్తాన్ని ఆకర్షించింది. దాదాపు పదేళ్లకు పైనే దాని గురించి మాట్లాడుకునేలా చేసింది. తన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని సొంత బిడ్డను ఓ కన్నతల్లే పొట్టనబెట్టుకున్న కేసది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని ఈ వాస్తవ గాథ.. ఇప్పుడు డాక్యు-సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంబై మెట్రో వన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున షీనా బోరా(22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. మళ్లీ ఆమె కనిపించనే లేదు. శవంగా తేలడంతో పోలీస్ దర్యాప్తు మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రాణీ ముఖర్జీకి మీడియా ఎగ్జిక్యూటివ్‌గా సొసైటీలో మంచి పేరుంది. షీనా అంటే ప్రాణం అన్నట్లుగా ఇంద్రాణి ఉండేది. అలాంటిది పోలీసులు ఆమె వైపు మళ్లుతారని ఎవరూ ఊహించి ఉండరు. అప్పటికే అక్రమంగా ఆయుధాల్ని కలిగి ఉన్నాడనే అభియోగాలతో ఆమె డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ అరెస్ట్ అయ్యాడు. అతనిచ్చిన సమాచారమే.. మొత్తం కేసునే మలుపు తిప్పింది. ♦ఇంద్రాణీ ముఖర్జీ.. మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. ♦అప్పటికే వయసుకొచ్చిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. అప్పటికే వ్యాపారంలోనూ ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు నష్టాలు చవిచూస్తూ ఉంది. ఆ సమయంలోనే షీనా తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. అందుకు రెండో భర్త సంజీవ్ ఖన్నా సహకారం కోరింది. ♦రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలింది. అసలు షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్యచేయాలని సంజీవ్‌ఖన్నా సూచించాడట. కానీ, ఆ ఇంట్లో షీనాతోపాటు తన భర్త(మూడో భర్త) పీటర్ ముఖర్జియా, కొడుకు రాహుల్ ముఖర్జియా కూడా ఉన్నందువల్లే ఇంద్రాణి ఆ ప్లాన్‌కు ఒప్పుకోలేదు. ఈ కేసులో రాహుల్ పేరు రావడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ♦దీంతో పీటర్ ముఖర్జియా ముంబైలో లేని సమయం చూసి.. షీనాను ఇంటికి పిలిచి హత్యచేయాలని ఇంద్రాణీ సంజీవ్‌కు సూచించింది. సొంతింట్లో హత్యజరిగితే పోలీసులు ఇంద్రాణీని అనుమానించే అవకాశం ఉండడంతో వద్దని సంజీవ్‌ఖన్నా ఆమెను వారించాడు. దీంతో ఇద్దరూ కలిసి.. కారులోనే షీనాను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం డ్రైవర్ శ్యాంరాయ్‌ను చేర్చుకుని హత్యకు కుట్ర పన్నారు. ♦1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలతో పాటు కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులైంది. కన్న కూతురు షీనాను హత్య చేసేందుకు ఎన్ని ప్లాన్లు వేసింది? ఏది వర్కవుట్ అయింది? పోలీస్ డైరీ ఆధారంగా.. షీనా బోరా హత్యకేసులో ముగ్గురు నిందితుల వాంగ్మూలాలతో పాటు... కాల్‌డాటా రికార్డులను పోలీసులు పోల్చిచూశారు. 23 ఏప్రిల్ 2012న జరిగిన సంఘటనలతో ఓ టైం లైన్ తయారు చేశారు. అది.. ఏప్రిల్ 23, 2012.. ఉదయం 9గంటలు: డ్రైవర్ శ్యాంరాయ్‌తో కలిసి ఇంద్రాణీ ముఖర్జీ.. రాయ్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. షీనాను హత్యచేశాక మృతదేహం ఎక్కడ పారేయ్యాలో నిర్ణయించుకుంది. ఉదయం 11.30నిమిషాలకు: రెండో భర్త సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసిన ఇంద్రాణి.. దాదాపు 7నిమిషాలు మాట్లాడింది. ఉదయం 11.37నిమిషాలకు: ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్‌టాప్ హోటల్లో సంజీవ్‌ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్ బుక్ చేసింది. అది.. ఏప్రిల్ 24, 2012.. మద్యాహ్నం 1.47నిమిషాలకు: సంజీవ్ ఖన్నా కోల్‌కతా నుంచి ముంబై చేరుకుని... ట్యాక్సీలో హిల్‌టాప్ హోటల్ చేరుకున్నాడు. మద్యాహ్నం 1.53నిమిషాలకు: ఇంద్రాణికి కాల్చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పిన సంజీవ్‌ఖన్నా మద్యాహ్నం 2.38నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసి రూమ్‌లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది ఇంద్రాణి. మద్యాహ్నం 3.11నిమిషాలకు: మరోసారి రెండోభర్త సంజీవ్‌ఖన్నాకు కాల్చేసి... హత్యకు సంబంధించి ప్లాన్‌పై డిస్కస్ చేసింది ఇంద్రాణి. సాయంత్రం 6గంటలకు: హిల్‌టాప్ హోటల్ నుంచి సంజీవ్‌ఖన్నాను హిల్‌టాప్ హోటల్ నుంచి పికప్ చేసుకుంది. ఇంద్రాణి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు డ్రైవ్ చేస్తున్నారు. సాయంత్రం 6.45 నిమిషాలకు: ముంబైలోని లింకింగ్ రోడ్ చేరుకున్న ముగ్గురు... షీనాబోరా కోసం ఎదురుచూశారు. సాయంత్రం 7.03 నిమిషాలకు: లింకింగ్ రోడ్‌లోని నేషనల్ కాలేజ్ సమీపంలో తన కోసం వెయిట్ చేస్తున్న ఓపెల్ కోర్సా కారులో కూర్చుంది షీనా. సాయంత్రం 7.16నిమిషాలకు: ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్ శ్యాం మనోహర్.. నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలీ వైపు ప్రయాణించింది. రాత్రి 8.27 నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు వేగంగా వెలుతున్న సమయంలో... కారు ఆపాల్సిందిగా డ్రైవర్‌ను ఇంద్రాణి ఆదేశించింది. అయితే అప్పటికే షీనాబోరాకు ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నాలు మత్తు మందు ఇచ్చిన విషయం డ్రైవర్‌కు తెలియదు. దీంతో తాను టాయిలెట్‌కు వెళతానని చెప్పి డ్రైవర్ శ్యాంమనోహర్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లగానే ఇంద్రాణీ తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్‌ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. డ్రైవర్ టాయిలెట్‌కు వెళ్లి తిరిగి రాగానే కారును దూరంగా పోనివ్వమని.. ఇంద్రాణి చెప్పింది. అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్ మార్చుకోవాలని ఇంద్రాణీ, సంజీవ్‌లు నిర్ణయించుకున్నారు. రాయ్‌గఢ్ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాతంలోనే శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్ అన్నాడు. రాత్రి 9.01నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని విఖ్రోలి ప్రాంతంలో పోలీస్ గస్తీని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. రాత్రి 9.14నిమిషాలకు: వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి శవాన్ని కారులోనే ఉంచి పీటర్ ముఖర్జియా ఇంట్లోని గ్యారేజ్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11.01 నిమిషాలకు: షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి... కారు డిక్కీలో ఉంచారు. అది.. ఏప్రిల్ 25, 2012 అర్థరాత్రి 12.19నిమిషాలకు: సంజీవ్‌ఖన్నా తన హిల్‌టాప్ హోటల్‌కు బయలేదేరాడు అర్ధరాత్రి 12.30నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు కాల్చేసిన ఇంద్రాణి... ఉదయం ఏంచేయాలనే దానిపై ఇద్దరు చర్చించుకున్నారు. అర్ధరాత్రి12. 57నిమిషాలకు: కారులోనే ఉన్న డ్రైవర్ శ్యాం రాయ్‌కు ఫోన్‌చేసింది ఇంద్రాణి. అర్ధరాత్రి 01.19నిమిషాలకు: మరోసారి డ్రైవర్ శ్యాంరాయ్‌కు ఫోన్ చేసిని ఇంద్రాణి... బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అర్ధరాత్రి 02.30నిమిషాలకు: తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణీ... డ్రైవర్‌తో కలిసి హిల్‌టాప్ హోటల్‌కు బయలుదేరి వెళ్లింది. అర్ధరాత్రి 02.47 నిమిషాలకు: రాయ్‌గఢ్‌లోని గగోడే బుద్రుక్ గ్రామానికి బయలుదేరిన ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యాంరాయ్. తెల్లవారుజామున 04.21 నిమిషాలకు: గగోడే బుద్రుక్ గ్రామ సమీపంలో చేరుకోగానే... కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణీ.. వెంటనే శవాన్ని దహనం చేయాలని చెప్పింది. తెల్లవారుజామున 04.33నిమిషాలకు: కారు దగ్గరికి వెళ్లి నిల్చున్న ఇంద్రాణి... సంజీవ్‌ఖన్న, శ్యాంరాయ్‌లు శవాన్ని మట్టుబెట్టేవరకు ఎదురుచూసింది. ఉదయం 05.13నిమిషాలకు: అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్దిదూరం వెళ్లి... తిరిగి శవాన్ని మట్టుబెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా చూసి ఇంటికి బయలుదేరారు. ఉదయం 07.33నిమిషాలకు: ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు. ట్విస్టుల పర్వం సాగిందిలా.. ♦April 24, 2012: షీనా బోరా ఉద్యోగానికి సెలవు పెట్టింది. ఆమె ఉద్యోగానికే రాజీనామా చేసిందని ఒకవైపు మీడియా.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిందని కుటుంబం ప్రకటించింది. అప్పటికి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. ♦May 23, 2012: నెలరోజుల తర్వాత.. మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లో షీనా బోరా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.. ఆపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు మొదలైంది. ♦August 2015: మూడేళ్ల తర్వాత.. కూతురిని చంపిందనే అభియోగాలపై ఇంద్రాణి ముఖర్జీ అరెస్ట్ అయ్యింది. ఆ మరుసటిరోజే కోల్‌కతాలో ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ♦August 2015: ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ శ్యామ్ రాయ్ కూడా అరెస్ట్ అయ్యాడు. ఈ ముగ్గురు నిందితుల్ని క్రైమ్ సీన్ రీక్రియేన్ చేశారు. దర్యాప్తులో డ్రైవర్ శ్యామ్ షీనాను హత్య చేసి.. మృతదేహాన్ని పడేశామని ఒప్పుకున్నాడు. ఇంద్రాణితో పాటు సంజీవ్ ఖన్నా కూడా ఇందులో భాగం అయ్యారని చెప్పాడు. ♦September 2015: షీనా బోరా కేసులో ఇది ఊహించని మలుపు. షీనా బోరా అసలు తండ్రిని తానేనంటూ కోల్‌కతాకు చెందిన సిద్ధార్థ దాస్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత.. కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ముగ్గురు నిందితులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ♦November 2015: షీనా బోరా హత్య కేసులో.. ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను సైతం సీబీఐ అరెస్ట్ చేసింది. ♦2016: ఇంద్రాణి ముఖర్జీ, ఆమె డ్రైవర్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత పీటర్ పేరును కూడా చేర్చారు. రాహుల్‌తో రిలేషన్షిప్ కారణంగానే.. ఇంద్రాణీ ఈ ఘాతుకానికి పాల్పడిందని సీబీఐ అందులో పేర్కొంది. ♦January-February 2017: కోర్టు విచారణ ప్రారంభం. షీనా బోరాను చంపేందుకు కుట్ర.. ఎత్తుకెళ్లి చంపడం.. ఆధారాలను నాశనం చేసే కుట్ర.. తప్పుడు సమాచారం ఇవ్వడం.. లాంటి అభియోగాలపై వాదప్రతివాదనలు మొదలయ్యాయి. ♦October 2019: ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాలకు విడాకులు మంజూరు చేసిన ముంబై ఫ్యామిలీ కోర్టు ♦March 2020: పీటర్ ముఖర్జియాకు బెయిల్ ♦July 2021: బెయిల్ కోరుతూ నాలుగు పిటిషన్లు దాఖలు చేస్తే.. అన్నింటిని సీబీఐ స్పెషల్ కోర్టు తిరస్కరించింది ♦August 2021: షీనా బోరా హత్య కేసు దర్యాప్తును ముగించినట్లు ప్రకటించుకున్న సీబీఐ ♦February 10, 2022: సుప్రీం కోర్టుకు చేరిన ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ అభ్యర్థన ♦February 18, 2022: సీబీఐతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరుతూ సుప్రీం నోటీసులు ♦March 25, 2022: ఇంద్రాణి ముఖర్జీ బెయిల్‌ను తిరస్కరించాలని సీబీఐ వాదన ♦May 18, 2022: ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నరేళ్లు జైల్లో గడపడంతో సుప్రీం బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరాలు చెప్పలేదు.. మంజూరు చేసింది. కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటూ ఆరేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఇంద్రాణి(50)కి 2022లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని ఈ సందర్భంగా కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ ఇవ్వడమే సబబుగా భావించింది. సుప్రీం ఊరట ఇచ్చాక.. ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందామెకు. దీంతో.. మే 20, 2022 శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది.. జైలు నుంచి బయటకు వచ్చాక ఇంద్రాణి చెప్పిన తొలి మాట. ‘ఒక కుటుంబంలోని చీకటి రహస్యం..యావత్ దేశాన్ని కుదిపేసిన సంచలన కుంభకోణం’ .. ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ సందర్భంగా.. మొదట ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది. అయితే, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సీబీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన డివిజన్ బెంచ్.. దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. దీనికి నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. విచారణ పూర్తయ్యేవరకు ప్రసారం చేయబోమని న్యాయస్థానానికి తెలిపింది. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో దీని విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. -
దేశాన్ని కుదిపేసిన ఘటనతో వెబ్ సిరీస్.. ఆపాలని సీబీఐ నోటీసులు
ముంబై కోర్టులో నెట్ ఫ్లిక్స్ మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పిటిషన్ దాఖలు చేసింది. ఒక హత్య కేసు కథాంశం చుట్టూ తెరకెక్కిన వెబ్ సిరీస్ విడుదలను ఆపాలని ఈమేరకు సీబీఐ కోరింది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా డాక్యుమెంటరీ-సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్' పేరుతో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న ఇందులో షానీ లెవీ, ఉరాజ్ బహల్ కీలక పాత్రలు పోషించారు. కొద్దిరోజుల క్రితం ఈ సిరీస్ నుంచి ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ కేసు గురించి అందరూ మాట్లాడుకునేవారు. త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సీబీఐ కోర్జుకు వెళ్లింది. విచారణ ముగిసే వరకు ఈ వెబ్ సిరీస్‌ను ఆపాలంటూ కోర్టు మెట్లు ఎక్కింది. సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రాసిక్యూటర్ సిజె నాండోడ్ ద్వారా కోర్టులో పిటీషన్ వేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మరికొందరికి ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్పీ నాయక్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసుపై ఫిబ్రవరి 20న విచారణ జరగనుంది. ఇంద్రాణీ తన కుమార్తె షీనా బోరాను డ్రైవర్ సహాయంతో హత్య చేసి సాక్ష్యాలను దాచి పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిందో, ఆమె జైలు జీవితాన్ని చూపిస్తూ ఒక ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. వాస్తవ ఘటనలో ఇంద్రాణి, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలిసి షీనాను కారులో గొంతుకోసి హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. సుమారు 10 ఏళ్లు దాటిన ఈ కేసు ఇంకా తేలలేదు. సీబీఐ పిటీషన్‌తో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ను ఆపేస్తారా..? ఇబ్బందులను దాటుకొని విడుదల చేస్తారో తెలియాల్సి ఉంది. -
దేశాన్ని కుదిపేసిన సంఘటన.. ఓటీటీలో ఇప్పుడు వెబ్ సిరీస్‌గా
నిజ జీవిత కథలతో సినిమాలు రావడం ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు మాత్రం వాటిని వెబ్ సిరీస్ లేదా డాక్యుమెంటరీస్ తరహాలో తీస్తున్నారు. ఇక దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అయితే ప్రధానంగా ఇలాంటి వాటిపైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి దేశంలోనే చర్చనీయాంశంగా మారిన కేసులపై సిరీస్‌లు తీస్తోంది. ఇప్పుడు కూడా అలానే అప్పట్లో సంచలనం సృష్టించిన 'షీనా బోరా కేసు' నేపథ్యంగా తీసిన సిరీస్‌ని స్ట్రీమింగ్కి రెడీ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) ఏంటీ 'షీనా బోరా' కేసు? 2012లో షీనా బోరాని హత్య జరిగింది. అయితే ఇది మూడేళ్ల తర్వాత బయటపడింది. ఇంద్రాణీ ముఖార్జియా అనే మహిళ కారు డ్రైవర్.. ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా షీనా బోరా హత్య గురించి సంచలన నిజాల్ని ఇతడు వెల్లడించాడు. కూతురు షీనాని.. సొంత తల్లి ఇంద్రాణీనే గొంతు నులిమి చంపేసిందని చెప్పాడు. దీంతో ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. దర్యాప్తులో బయటపడిన వివారల ప్రకారం.. తన భర్త నుంచి ఇంద్రాణీ విడిపోయిన తర్వాత కూతురు షీనా, కొడుకు మైకేల్‌ని గౌహతిలో ఉన్న తన తల్లిదండ్రుల దగ్గర ఉంచేసింది. కొన్నాళ్ల తర్వాత సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని ఇంద్రాణీ పెళ్లి చేసుకుంది. ఇతడితో కూడా ఇంద్రాణీ ఎక్కువ రోజులు సంసారం చేయలేక విడిపోయింది. ఆ తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖార్జియాని ఇంద్రాణీ వివాహమాడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే పీటర్- అతడి తొలి భార్యకు పుట్టిన కొడుకుని షీనా ప్రేమించింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) ఇక తల్లి పీటర్ ని పెళ్లి చేసుకోవడంతో ఆ కుర్రాడు.. షీనాకు అన్న వరస అవుతాడు. ఈ విషయమై ఇంద్రాణీ-షీనా మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. సొంత కూతురినే చంపాలని ప్లాన్ చేసింది. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో కూతురిని హతమార్చింది. మృతదేహాన్ని చత్తీస్‌ఘడ్‌లోని అటవీ ప్రాంతంలో కాల్చేసింది. 2012లో హత్య జరగ్గా 2015లో పోలీసులకు విషయం తెలిసి ఇంద్రాణీతో పాటు రెండో భర్త సంజీవ్, మూడో భర్త పీటర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. జైల్లో ఉన్న టైంలోనే అంటే 2019లో ఇంద్రాణీ తన భర్త మూడో భర్త పీటర్‌కి కూడా విడాకులు ఇచ్చేసింది. ఇదే స్టోరీతో 'ద ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్' పేరుతో డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ తీశారు. ఫిబ్రవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి సిరీస్‌లో తెలిసిన విషయాలతో పాటు కొత్తవి ఏమేనా ఉంటాయా? లేదా? అనేది చూడాలి. (ఇదీ చదవండి: 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) A sensational scandal that rocked the entire nation, with one family's darkest secrets at the center of it all.#TheIndraniMukerjeaStoryBuriedTruth, coming on 23 February only on Netflix! pic.twitter.com/PIFyDWowIP — Netflix India (@NetflixIndia) January 29, 2024 -
ఇంద్రాణీ ముఖర్జీతో కలిసి ఉండడానికి వీల్లేదు
ముంబై: ఇంద్రాణీ-పీటర్ ముఖర్జీల కూతురు విధీ ముఖర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తల్లితో కలిసి జీవించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను ముంబై ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించే ముందు సీబీఐ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. విధీ ముఖర్జీ గత కొన్ని సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తోంది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తన తల్లిని కలిసేందుకు సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ కోర్టు ముందుకు రావడంతో ఆమె లండన్ నుంచి వచ్చారు. కన్నకూతురు షీనా బోరా హత్య కేసులో ప్రథమ నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ.. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే తల్లికి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. ఆమెతో ఉండేందుకు అనుమతించాలని విధీ ముఖర్జీ తన అభ్యర్థనలో పేర్కొంది. అంతేకాదు.. 2015లో ఇంద్రాణీ అరెస్ట్ తర్వాత తల్లికి దూరమై తాను భావోద్వేగానికి లోనయ్యానని.. మైనర్‌గా ఉన్న తాను తల్లికి దూరమై కుమిలిపోయానని విధీ తన అభ్యర్థనలో చెప్పుకొచ్చింది. అయితే ప్రాసిక్యూషన్(సీబీఐ) మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. విధీ ముఖర్జీ సైతం ఈ కేసులో సాక్షిగా ఉందని, ఆమెను ఇప్పటివరకు ప్రశ్నించని విషయాన్ని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఆధారాల సేకరణ పూర్తయ్యే వరకు ఇంద్రాణీ ఎవరినీ కలవడానికి.. అనుమతి లేదన్న విషయాన్ని సీబీఐ, ప్రత్యేక న్యాయస్తానానికి గుర్తు చేసింది. ఒకవేళ విధి పిటిషన్‌ను విచారణకు గనుక స్వీకరిస్తే.. ఇంద్రాణీ బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. ఈ తరుణంలో.. సీబీఐ వాదనలో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజనీత్ సంఘాల్.. విధీ ముఖర్జీ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కన్నకూతురైన షీనా బోరా(24)ను.. ఇంద్రాణీ ముఖర్జీ తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌తో కలిసి కారులో 2012లో దారుణంగా హత్య చేసి.. శవాన్ని రాయ్‌గఢ్ జిల్లా శివారులోని అడవుల్లో తగలబెట్టింది. 2015లో వేరే కేసులో అరెస్ట్ అయిన శ్యామ్వర్ రాయ్ నోరు విప్పడంతో ఈ సంచలన కేసు వెలుగు చూసింది. ఈ కుట్రలో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉందని తేలడంతో ఆయన్ని అరెస్ట్ చేయగా.. 2020లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆపై ఇంద్రాణీ-పీటర్లు విడాకులు తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? -
ఇంకెంత కాలం?
‘‘పక్కింటి అమ్మాయి, కాలేజీ స్టూడెంట్, మరదలు పిల్ల.. ఇలాంటి పాత్రలు ఇంకెంత కాలం చేస్తాను? ప్రయోగాత్మకమైన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కథానాయిక పాత్రలే కాదు.. ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలతో కూడా ప్రేక్షకులకు దగ్గర కావొచ్చు’’ అని అంటున్నారు రాయ్‌లక్ష్మీ. చెప్పినట్లుగానే ఓ నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2015లో ముంబైలో వెలుగులోకి వచ్చిన షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. కూతురు షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా 2012లో హత్య చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంచలన సంఘటన ఆధారంగా దర్శకుడు స్వరాజ్ ఓ సినిమా చేయాలని కథ రెడీ చేస్తున్నారు. ఇందులో ఇంద్రాణీ పాత్ర చేయమని రాయ్‌లక్ష్మీని అడిగితే ఓకే అన్నారట. -
‘చనిపోయేలోపు నా పిల్లలతో మాట్లాడనివ్వండి’
ముంబై: చనిపోయే లోపు తన పిల్లలతో మాట్లాడే అవకాశం కల్పించండి అంటూ ముంబై సీబీఐ కోర్టును వేడుకున్నారు మాజీ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా ప్రధాన నిందితుడనే సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం సీబీఐ కోర్టుకు హాజరైన పీటర్ ముఖర్జియా ‘నేను ఎంతకాలం జీవిస్తానో నాకు తెలియదు. నేను చనిపోయేలోపు విదేశాల్లో ఉన్న నా పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నాను. అందుకు నాకు అనుమతివ్వండి’ అంటూ ముఖర్జియా న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఇందుకు జడ్జి సానుకులంగా స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని తెలిపారు. షీనా బోరా హత్య కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జియా పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకే షీనాను హత్య చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. (చదవండి: వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..) -
పీటర్ బెయిల్ పై విచారణ వాయిదా
ముంబై: షీనా బొరా హత్య కేసులో నిందితుడు పీటర్ ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను బాంబే హైకోర్టు జులై 7కు వాయిదా వేసింది. ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై స్పందన తెలియజేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. సెషన్ కోర్టు రెండుసార్లు బెయిల్ తిరస్కరించడంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది నవంబర్ లో అతడిని అరెస్ట్ చేశారు. పీటర్ తో పాటు ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, మాజీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ నిందితులుగా ఉన్నారు. తనకు క్షమాభిక్ష పెడితే అప్రూవర్‌గా మారతానని శ్యామ్వర్ అభ్యర్థించగా కోర్టు అనుమతి ఇచ్చింది. 2012, ఏప్రిల్ 24న షీనా బొరా హత్యకు గురైంది. 2015లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. -
పీటర్‌పై కూడా హత్యారోపణలు
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో మరో కీలక మలుపుతిరిగింది. ఈ కేసులో ముందునుంచి తనకు ఎలాంటి ప్రమేయం లేనట్లు దూరంగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియా భర్త పీటర్ ముఖర్జియాపై దర్యాప్తు అధికారులు హత్యారోపణలు మోపనున్నారు. ఈ మేరకు ఆయనపై ఆరోపణలు ఖరారు చేస్తూ ఛార్జిషీటులో పేర్కొననున్నట్లు కీలక వర్గాల సమాచారం. షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ లను సీబీఐ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. అనంతరం ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను కూడా నిందితునిగా పేర్కొంటూ రిమాండ్ చేసింది. తల్లీకూతుళ్ల మధ్య తగాదాలు, బెదిరింపులు, ఆస్తి వివాదాలు, రాహుల్‌తో ప్రేమ వ్యవహారం నచ్చని ఇంద్రాణి ముఖర్జీ.. షీనా హత్యకు పథకం వేసిందని ప్రాథమిక నిర్ధారణకు సీబీఐ వెల్లడించింది. కానీ, అనూహ్యంగా పీటర్ పై కూడా హత్యరోపణలు నమోదుచేయాలనుకోవడంతో ఈ కేసు అసలు ఎటు వెళుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
మరోసారి ఇంద్రాణిపై జైల్లోనే ప్రశ్నల వర్షం
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో నిందితులను మరోసారి విచారించేందుకు సీబీఐకి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా, మరో ఇద్దరు నిందితులను మరోసారి జైలులోనే సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. 'మేం ఇంద్రాణిని, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, ఆమె డ్రైవర్ శ్యాం రాయ్‌ని మరోసారి జైలులోనే విచారించాలని అనుకుంటున్నాము' అని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అందుకు కోర్టు అనుమతిచ్చినట్లు చెప్పారు. -
షీనా బోరా హత్య కేసులో అనూహ్య మలుపు
-
ఇంద్రాణిని విచారించనున్న సీబీఐ
ముంబై: సంచలం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా సహా ఇతర నిందితులను సీబీఐ విచారించనుంది. బుధవారం ముంబై కోర్టు ఈ మేరకు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ నిందితులుగా ఉన్నారు. నిందితులు ముగ్గురు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. వీరి ముగ్గురికి ఈ నెల 19వరకు ముంబై కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది. -
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
-
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
ముంబై: షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా జ్యుడిషియల్ కస్టడీని పొడగించారు. ఇంద్రాణితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌కు ఈ నెల 19వరకు కస్టడీ పొడగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంద్రాణి ప్రస్తుతం ముంబై జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బైకలా జైల్లో రిమాండ్‌లో ఉన్న ఇంద్రాణి గత శుక్రవారం అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. కాగా ప్రస్తుతం ఇంద్రాణి ఆరోగ్యం మెరుగవుతోంది. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశముంది. ఆమెను ఆస్పత్రి నుంచి జైలుకు తరలిస్తారు.