పీటర్ బెయిల్ పై విచారణ వాయిదా | Sheena case: HC seeks CBI's response on Peter's bail plea | Sakshi
Sakshi News home page

పీటర్ బెయిల్ పై విచారణ వాయిదా

Published Mon, Jun 27 2016 6:21 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

Sheena case: HC seeks CBI's response on Peter's bail plea

ముంబై: షీనా బొరా హత్య కేసులో నిందితుడు పీటర్ ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను బాంబే హైకోర్టు జులై 7కు వాయిదా వేసింది. ముఖర్జియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై స్పందన తెలియజేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. సెషన్ కోర్టు రెండుసార్లు బెయిల్‌ తిరస్కరించడంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది నవంబర్ లో అతడిని అరెస్ట్ చేశారు.

పీటర్ తో పాటు ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, మాజీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ నిందితులుగా  ఉన్నారు. తనకు క్షమాభిక్ష పెడితే అప్రూవర్గా మారతానని శ్యామ్వర్ అభ్యర్థించగా కోర్టు అనుమతి ఇచ్చింది. 2012, ఏప్రిల్ 24న షీనా బొరా హత్యకు గురైంది. 2015లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement