పీటర్పై కూడా హత్యారోపణలు
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో మరో కీలక మలుపుతిరిగింది. ఈ కేసులో ముందునుంచి తనకు ఎలాంటి ప్రమేయం లేనట్లు దూరంగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియా భర్త పీటర్ ముఖర్జియాపై దర్యాప్తు అధికారులు హత్యారోపణలు మోపనున్నారు. ఈ మేరకు ఆయనపై ఆరోపణలు ఖరారు చేస్తూ ఛార్జిషీటులో పేర్కొననున్నట్లు కీలక వర్గాల సమాచారం.
షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ లను సీబీఐ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. అనంతరం ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను కూడా నిందితునిగా పేర్కొంటూ రిమాండ్ చేసింది. తల్లీకూతుళ్ల మధ్య తగాదాలు, బెదిరింపులు, ఆస్తి వివాదాలు, రాహుల్‌తో ప్రేమ వ్యవహారం నచ్చని ఇంద్రాణి ముఖర్జీ.. షీనా హత్యకు పథకం వేసిందని ప్రాథమిక నిర్ధారణకు సీబీఐ వెల్లడించింది. కానీ, అనూహ్యంగా పీటర్ పై కూడా హత్యరోపణలు నమోదుచేయాలనుకోవడంతో ఈ కేసు అసలు ఎటు వెళుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.