నిజ జీవిత కథలతో సినిమాలు రావడం ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు మాత్రం వాటిని వెబ్ సిరీస్ లేదా డాక్యుమెంటరీస్ తరహాలో తీస్తున్నారు. ఇక దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అయితే ప్రధానంగా ఇలాంటి వాటిపైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి దేశంలోనే చర్చనీయాంశంగా మారిన కేసులపై సిరీస్‌లు తీస్తోంది. ఇప్పుడు కూడా అలానే అప్పట్లో సంచలనం సృష్టించిన 'షీనా బోరా కేసు' నేపథ్యంగా తీసిన సిరీస్‌ని స్ట్రీమింగ్‌కి రెడీ చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)
ఏంటీ 'షీనా బోరా' కేసు?
2012లో షీనా బోరాని హత్య జరిగింది. అయితే ఇది మూడేళ్ల తర్వాత బయటపడింది. ఇంద్రాణీ ముఖార్జియా అనే మహిళ కారు డ్రైవర్.. ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా షీనా బోరా హత్య గురించి సంచలన నిజాల‍్ని ఇతడు వెల్లడించాడు. కూతురు షీనాని.. సొంత తల్లి ఇంద్రాణీనే గొంతు నులిమి చంపేసిందని చెప్పాడు. దీంతో ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది.
దర్యాప్తులో బయటపడిన వివారల ప్రకారం.. తన భర్త నుంచి ఇంద్రాణీ విడిపోయిన తర్వాత కూతురు షీనా, కొడుకు మైకేల్‌ని గౌహతిలో ఉన్న తన తల్లిదండ్రుల దగ్గర ఉంచేసింది. కొన్నాళ్ల తర్వాత సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని ఇంద్రాణీ పెళ్లి చేసుకుంది. ఇతడితో కూడా ఇంద్రాణీ ఎక్కువ రోజులు సంసారం చేయలేక విడిపోయింది. ఆ తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖార్జియాని ఇంద్రాణీ వివాహమాడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే పీటర్- అతడి తొలి భార్యకు పుట్టిన కొడుకుని షీనా ప్రేమించింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?)
ఇక తల్లి పీటర్ ని పెళ్లి చేసుకోవడంతో ఆ కుర్రాడు.. షీనాకు అన్న వరస అవుతాడు. ఈ విషయమై ఇంద్రాణీ-షీనా మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. సొంత కూతురినే చంపాలని ప్లాన్ చేసింది. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో కూతురిని హతమార్చింది. మృతదేహాన్ని చత్తీస్‌ఘడ్‌లోని అటవీ ప్రాంతంలో కాల్చేసింది. 2012లో హత్య జరగ్గా 2015లో పోలీసులకు విషయం తెలిసి ఇంద్రాణీతో పాటు రెండో భర్త సంజీవ్, మూడో భర్త పీటర్‌ని కూడా అదుపులోకి తీసుకున్నారు. జైల్లో ఉన్న టైంలోనే అంటే 2019లో ఇంద్రాణీ తన భర్త మూడో భర్త పీటర్‌కి కూడా విడాకులు ఇచ్చేసింది.
ఇదే స్టోరీతో 'ద ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్' పేరుతో డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ తీశారు. ఫిబ్రవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి సిరీస్‌లో తెలిసిన విషయాలతో పాటు కొత్తవి ఏమేనా ఉంటాయా? లేదా? అనేది చూడాలి.
(ఇదీ చదవండి: 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
A sensational scandal that rocked the entire nation, with one family's darkest secrets at the center of it all.#TheIndraniMukerjeaStoryBuriedTruth, coming on 23 February only on Netflix! pic.twitter.com/PIFyDWowIP
— Netflix India (@NetflixIndia) January 29, 2024
Comments
Please login to add a commentAdd a comment