కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంపై మరోసారి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు నిర్వహించింది. ఢిల్లీతో పాటు చెన్నైలోని కార్తీ చిదంబరం నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా వ్యవహారం కేసులో ఈడీ మళ్లీ సోదాలు చేపట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం కార్తీ చిదంబరం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన గైర్హాజరు అయ్యారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.