సాక్షి, చెన్నై: సీబీఐ గాలిస్తున్న అజ్ఞాత నేరస్తుల జాబితాలో కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ చేర్చింది. ఆయన విదేశీయానంపై నిషేధం విధించింది. ఐటీ, సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణకు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో..వీటిని వ్యతిరేకిస్తూ శుక్రవారం కార్తీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ఈనెల 7వ తేదీన విచారణ జరగనుంది. షెల్ కంపెనీల నుంచి భారీ ఎత్తున విదేశీ మారకద్రవ్యం పొందినట్లుగా కార్తీపై సీబీఐ అభియోగం.