
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఝలక్ తగిలింది. బెయిల్ పిటిషన్ ను మార్చి 15కు వాయిదా వేసిన కోర్టు.. కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్లు తీర్పునిచ్చింది. అంతకు ముందు అతన్ని అరెస్ట్(మార్చి 20వ తేదీ వరకు) చేయరాదని ఈడీని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ముందుగా ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అభ్యర్థించగా.. కోర్టు మాత్రం మూడు రోజులకు అనుమతిచ్చింది. దర్యాప్తు పొడిగించటంతో ఆయనకు మరిన్ని చిక్కులు తప్పేలా కనిపించటం లేదు. కార్తీని ఆయన అడిటర్‌తో సహా విచారణ చేపట్టే అవకాశం ఉందని.. అవసరమైతే నార్కో పరీక్షలు కూడా నిర్వహించే యోచనలో సీబీఐ ఉన్నట్లు సమాచారం. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కార్తీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది.