
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం సీబీఐ కస్టడీని సెప్టెంబర్ 5వరకూ సుప్రీం కోర్టు పొడిగించింది. చిదంబరంను ఇప్పుడే తీహార్ జైలుకు తరలించరాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ మేరకు పేర్కొంది. అరెస్ట్ వారెంట్‌కు వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను ఈనెల 5న విచారణకు చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది. మరోవైపు ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం తదుపరి కస్టడీ అవసరం లేదని, ఆయనను జ్యడిషియల్ కస్టడీ కింద తీహార్ జైలుకు తరలించాలని సీబీఐ వాదించింది. తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను సవాల్ చేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను ఈనెల 5న విచారిస్తామని జస్టిస్ ఆర్ భానుమతి, ఏఎస్ బొపన్నలతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. దిగువ కోర్టుల అధికార పరిధిలో తాము జోక్యం చేసుకోరాదని తాము గుర్తెరిగామని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment