ముంబై : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో దాదాపు 100 రోజుల నుంచి తిహార్ జైలులో గడుపుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం మహారాష్ట్రలో కొలువుతీరనున్న సంకీర్ణ సర్కార్‌కు కీలక సూచన చేశారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన సంకీర్ణ సర్కార్ ప్రజా ఆకాంక్షలకు అద్దం పట్టాలని కోరారు. పార్టీల వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి రైతు సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా శిశుసంక్షేమం వంటి ప్రజా ప్రయోజనాలపై మూడు పార్టీలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ , ప్రియాంక గాంధీలు జైలులో తనను కలిసిన కొద్దిసేపటి తర్వాత చిదంబరం ఈ మేరకు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment