మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు క్లియరెన్స్ లభించడంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరంను బుధవారం సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి చిదంబరంను దర్యాప్తు సంస్థ దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. తాను సీబీఐ ఎదుట హాజరయ్యాయనని, ఎఫ్‌ఐఆర్‌లో తనపై ఎలాంటి ఆరోపణలు పొందుపరచలేదని సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం చిదంబరం చెప్పారు.
ఎఫ్‌ఐపీబీ పైళ్ల ఆధారంగా సీబీఐ అధికారులు తనను ప్రశ్నించగా వాటికి తగిన సమాధానాలు ఇచ్చానని చిదంబరం ట్వీట్ చేశారు. షీనాబోరా హత్య కేసులో నిందితులుగా ఉన్న పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిలు ఐఎన్‌ఎక్స్ మీడియా ప్రమోటర్లు కావడం గమనార్హం. ఈ కంపెనీలో రూ 305 కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులకు యూపీఏ 1 హయాంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎఫ్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment