సాక్షి, హైదరాబాద్: వివేకా హత్య కేసులో పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. అనంతరం, ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో భాస్కర్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత.. సీబీఐ న్యాయమూర్తి ఎదుట భాస్కర్ రెడ్డిని హాజరుపరిచారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధించారు.
ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ‘రేపు(సోమవారం) కోర్టులో కౌంటర్ ఫైల్ చేస్తాం. భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు వివరించాం. ఆయనకు బీపీ 190 ఉన్నట్టు వైద్యులు చెప్పారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని చెప్పాం. హెల్త్ విషయంలో సీబీఐకి విజ్ఞప్తి చేశాం. మా వాదనలు వినిపించాం. ఎస్పీ స్థాయి అధికారి అరెస్ట్ చేయడం సరికాదని చెప్పాం. జైల్లో సదుపాయాలు సంతృప్తికరంగా లేకపోతే కోర్టుకు తెలియజేస్తాం. టార్గెట్ చేస్తూ దర్యాప్తు సాగడంపై ఎంపీ అవినాష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు సాగడం సరికాదని చెబుతూనే ఉన్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment