కార్తీ చిదంబరం (ఫైల్‌ఫోటో)
సాక్షి, చెన్నై : విదేశీ ఆస్తులను వెల్లడించలేదనే ఆరోపణలపై ఆదాయ పన్ను శాఖ మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి వారెంటు జారీ చేసిన క్రమంలో మద్రాస్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కార్తీపై ఆదాయ పన్ను శాఖ నల్లధనానికి సంబంధించిన కేసులో జారీ చేసిన వారెంట్‌పై ఆదివారం అర్థరాత్రి చేపట్టిన విచారణలో మద్రాస్ హైకోర్టు ఆయనకు ఊరట కల్పించింది.
కార్తీ విదేశాల నుంచి తిరిగివచ్చే వరకూ ఆయనపై జారీ చేసిన వారెంట్‌ను పక్కనపెట్టాలని ఐటీ శాఖను ఆదేశించింది. ఐటీ వారెంట్ నేపథ్యంలో కార్తీ అరెస్ట్‌ను నివారించేందుకు ఆయన న్యాయవాదులు ఏఆర్‌ఎల్ సుందరేశన్, సతీష్ పరాశరన్‌లు ఆదివారం రాత్రి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ అధికారిక నివాసాన్ని ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్‌తో సంబంధిత న్యాయమూర్తిని ఆశ్రయించాలని వారికి ప్రధాన న్యాయమూర్తి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment