‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’ | Ghulam Nabi Azad Critics Triple Talaq Bill In Rajya Sabha Debate | Sakshi
Sakshi News home page

‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’

Published Tue, Jul 30 2019 4:45 PM | Last Updated on Tue, Jul 30 2019 5:04 PM

Ghulam Nabi Azad Critics Triple Talaq Bill In Rajya Sabha Debate - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ పలు అంశాలను లేవనెత్తారు. ఈ బిల్లుతో ముస్లిం కుటుంబాలకు మేలు జరగకపోగా.. అవి విచ్ఛిన్నయ్యే అవకాశాలే అధికంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ బిల్లును తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యభర్తలు చెరో లాయర్‌ను మాట్లాడుకుని.. ఉన్న కాస్తోకూస్తో ఆస్తిని కోర్టు వ్యవహారాలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని అన్నారు. మైనారిటీ సోదరసోదరీమణుల మధ్య ట్రిపుల్‌ తలాక్‌ చిచ్చుపెడుతుందని హెచ్చరించారు.

ఎట్టకేలకు కోర్టు తీర్పు అనంతరం ఆ కుటుంబం దివాళా తీయాల్సిందేనా అని ప్రశ్నించారు. అప్పటికే ఆర్థికంగా నష్టాలపాలు కావడంతో జైలు పాలైన వ్యక్తి జీవితం దుర్భరంగా మారుతుందని చెప్పారు. వారిని ఆత్మహత్య చేసుకునేందుకు.. లేక బందిపోటుగా మారేందుకు ఈ బిల్లు పురిగొల్పుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement