
సాక్షి, హైదరాబాద్: కొండగట్టు ప్రమాద నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తెలంగాణ పర్యటన వాయిదా పడిందని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చి, సాయంత్రం సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం రాత్రి హైదరాబాద్‌లోనే బసచేసి గురువారం ఉదయ్‌పూర్ వెళ్లాల్సి ఉంది. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగి 57 మంది మృతి చెందడంతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభ మాత్రం యథావిధిగా జరగనుంది. ఇక ఈ నెల 18న ఆజాద్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
నేడు కొండగట్టుకు టీపీసీసీ బృందం
కొండగట్టు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వారిని పరామర్శించేందుకు కాంగ్రెస్ బృందం బుధవారం కరీంనగర్ జిల్లాకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment