మీడియాతో మాట్లాడుతున్న గులాంనబీ ఆజాద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్ అన్నారు. తొలుత ముస్లిం సోదరులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని వైఎస్సార్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. అయితే, సుప్రీం కోర్టు ఒప్పుకోకపోవడంతో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆజాద్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ముస్లింలను మోసం చేశారని ఆరోపించారు. వైఎస్సార్ ప్రతిపాదించిన 5 శాతం రిజర్వేషన్లనే కోర్టు అనుమతించనపుడు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ముస్లింలకు కేసీఆర్ ఎలా హామీనిచ్చారని ప్రశ్నించారు. వైఎస్సార్ కృషితో ముస్లింలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment