న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లోని జీ–23 గ్రూప్ నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం పార్టీ చీఫ్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు జీ–23 నేతలు చేసిన ప్రతిపాదనలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు అనంతరం మీడియాకు చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులపై పోరాటానికి కాంగ్రెస్ ఎలా సన్నద్ధం కావాలన్న అంశంపై చర్చించాననని తెలిపారు.
మీడియాకు ఇదొక పెద్ద వార్త కావొచ్చేమోగానీ తమకు మాత్రం మామూలు సమావేశమేనన్నారు. తమ అధినేత సోనియా గాంధీ పార్టీ నేతలతో తరచుగా సమావేశమవుతూనే ఉంటారని, పార్టీ వ్యవహారాలపై చర్చిస్తుంటారని ఆజాద్ ఉద్ఘాటించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలు ఉన్నాయన్నారు. తమ అభిప్రాయాలను సోనియాకు వివరించానని చెప్పారు. పార్టీ పటిష్టత కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేశారని ప్రశ్నించగా, అవన్నీ గుర్తుంచుకొని రికార్డు చేయడం సాధ్యం కాదని ఆజాద్ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment