'కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది' | BJP seeking revenge instead of resignations: Congress | Sakshi
Sakshi News home page

'కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది'

Published Thu, Jul 23 2015 7:35 PM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

'కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది'

'కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది'

న్యూఢిల్లీ: బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. విపక్షాలు లేవనెత్తిన డిమాండ్ల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ మంత్రులతో రాజీనామా చేయించకుండా అవసరం లేని అంశాలను బీజేపీ తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.

సుష్మా స్వరాజ్, వసుంధ రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టీకరించారు. ఇప్పటివరకు వీరిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తోందని ఆజాద్ ఆరోపించారు. ఇది అప్రజాస్వామికమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement