revenge politics
-
రోడ్లపై నాట్లు..వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు
పశ్చిమగోదావరి జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు, పోలీసుల అత్యుత్సాహం చూపారు. కొన్ని రోజుల క్రితం నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బ తిన్న రోడ్లపై వరి నాట్లు నాటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాపిరాజుగూడెంకు చెందిన వైఎస్సార్సీపీ నేత వీరమాచనేని నాగబాబు నిరసన తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ నాయకులు నాగబాబుపై కక్ష సాధింపునకు దిగారు. నాగబాబు రోడ్లను ధ్వంసం చేశారంటూ గ్రామ వీఆర్ఓ చేత ఫిర్యాదు చేయించి...విచారణ పేరుతో పెదవేగి పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఒత్తిడితోనే వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి అధికారులు, పోలీసులు తలొగ్గడంపై సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి. -
'కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది'
న్యూఢిల్లీ: బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. విపక్షాలు లేవనెత్తిన డిమాండ్ల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ మంత్రులతో రాజీనామా చేయించకుండా అవసరం లేని అంశాలను బీజేపీ తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సుష్మా స్వరాజ్, వసుంధ రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టీకరించారు. ఇప్పటివరకు వీరిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తోందని ఆజాద్ ఆరోపించారు. ఇది అప్రజాస్వామికమని అన్నారు.