వరినాట్లు వేసి నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ నాయకులు(పాత చిత్రం)
పశ్చిమగోదావరి జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు, పోలీసుల అత్యుత్సాహం చూపారు. కొన్ని రోజుల క్రితం నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బ తిన్న రోడ్లపై వరి నాట్లు నాటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాపిరాజుగూడెంకు చెందిన వైఎస్సార్సీపీ నేత వీరమాచనేని నాగబాబు నిరసన తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ నాయకులు నాగబాబుపై కక్ష సాధింపునకు దిగారు.
నాగబాబు రోడ్లను ధ్వంసం చేశారంటూ గ్రామ వీఆర్ఓ చేత ఫిర్యాదు చేయించి...విచారణ పేరుతో పెదవేగి పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఒత్తిడితోనే వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి అధికారులు, పోలీసులు తలొగ్గడంపై సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment