Former Union Minister Ghulam Nabi Azad On BJP Push For Civil Code - Sakshi
Sakshi News home page

‘ఉమ్మడి పౌరస్మృతి మంచిది కాదు’! ఎందుకో ఆజాద్‌ మాటల్లోనే..

Published Sat, Jul 8 2023 8:14 PM | Last Updated on Sat, Jul 8 2023 8:39 PM

Ghulam Nabi Azad On BJP Push For Civil Code - Sakshi

శ్రీనగర్‌: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు రూపకల్పన దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ​.. కశ్మీరీ సీనియర్‌ నేత.. డెమొక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ చైర్మన్‌ గులాంనబీ ఆజాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ గురించి ఆలోచనే చేయొద్దంటూ కేంద్రంలోని బీజేపీకి సూచించారాయన. 

యూసీసీ అనేది చాలా సంక్లిష్టమైన అంశం. ఆర్టికల్‌ 370(జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక హోదాకు సంబంధించి..) రద్దు చేసినంతలా సులువు కాదు. ఎందుకంటే.. ఇది కేవలం ముస్లింలతో ముడిపడిన అంశం కాదు. క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, గిరిజనులు.. ఇలా అందరితో ముడిపడి ఉంది. 

అన్ని మతాలకు, వర్గాలకు ఆగ్రహం తెప్పించే అంశం ఇది. ఏ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. అలాగే కేంద్రంలోని బీజేపీకి కూడా.  కాబట్టి.. అసలు ఉమ్మడి పౌర స్మృతి ముందడుగు వద్దని.. అసలు ఆ ఆలోచనే వద్దని కేంద్రానికి సూచించారాయన. ఆపై దేశంలో తాజా రాజకీయ పరిణామాలపైనా ఆయన స్పందిస్తూ.. ముఖ్యంగా ఎన్సీపీ సంక్షోభం తనను బాధించిందని చెప్పారు. 

కిందటి ఏడాది సెప్టెంబర్‌లో యాభై ఏళ్ల కాంగ్రెస్‌తో అనుబంధాన్ని తెంచుకుని.. సొంత పార్టీ ద్వారా కశ్మీర్‌ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు ఆజాద్‌.  

ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement