మతప్రాతిపదికన ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్నాసరే..
ఆర్టికల్ 370, యూసీసీ, ముస్లిం కోటాపై అమిత్ షా వ్యాఖ్య
న్యూఢిల్లీ: విపక్షాల విమర్శలకు జడిసేదిలేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పష్టంచేశారు. ఆరి్టకల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి, ముస్లింలకు కోటాను వ్యతిరేకిస్తూ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మతం అంశాన్ని ముందుకు తెస్తోందని విపక్షాలు విమర్శించినాసరే తాము అలాగే చేస్తామని కుండబద్దలు కొట్టారు. ఆదివారం పీటీఐతో ఇంటర్వ్యూలో షా వెల్లడించిన విషయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే..
మేం అప్పుడు ఓడిపోయాం కదా!
‘‘రాజ్యాంగంలో లేనివిధంగా మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు విపక్షాలు ఇస్తామంటే వ్యతిరేకిస్తున్నాం. ఆరి్టకల్ 370ని రద్దుచేశాం, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చాం. చేసిన పనులనే చెప్పుకుంటున్నాం. వద్దు అని విపక్షాలు అన్నాసరే మేం అలాగే చేస్తాం. కావాలనే పోలింగ్ శాతాలను ఈసీ ఆలస్యంగా వెల్లడిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని విపక్షాలు అంటున్నాయి.
ఈవీఎంలను బీజేపీ తమకు అనుకూలంగా మార్చేస్తోందని విపక్షాల చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. తెలంగాణ, పశి్చమబెంగాల్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఈసీ ఇలాగే చేసింది. అప్పుడు ఆ రాష్ట్రాల్లో మేం ఓడిపోయాంకదా. ఆ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఈ ఎన్నికలు కూడా అంతే పారదర్శకంగా జరుగుతున్నట్లే లెక్క. ఓడిపోతానని రాహుల్ గాంధీ ఊహించారు. అందుకే ముందే ఏడ్చేసి, ఏవో కారణాలు చెప్పేసి విదేశాలకు వెళ్లిపోతారు. జూన్ 6న విదేశాలకు వెళ్తారేమో. అందుకే ఏదో ఒకటి చెప్తున్నారు’’
‘400’ అనేది నినాదం కాదు
‘‘ మేం 399 సీట్లు సాధిస్తే ‘ మీకు 400 రాలేదుగా’ అని విపక్షాలు విమర్శిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తా. ఈసారి 400 సీట్లు గెలుస్తాం అనేది మా నినాదం కాదు. విజయావకాశాలను లెక్కగట్టి చెప్పిన సంఖ్య అది. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వల్లే మేం ఈసారి ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం. పేద కుటుంబమహిళకు ఏటా రూ.1 లక్ష ఇస్తామని కాంగ్రెస్ అమలుచేయలేని వాగ్దానాలిస్తోంది. 2–3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిస్తోంది. రూ.1 లక్ష సంగతి దేవుడెరుగు గతంలో హామీ ఇచి్చనట్లు(హిమాచల్ ప్రదేశ్‌లో) రూ.1,500 అయినా ఇస్తారేమో చూద్దాం.
బెంగాల్, ఒడిశాలోనూ మాదే హవా
‘‘పశ్చిమబెంగాల్‌లో 24–30 సీట్లు, ఒడిశాలో 16–17 సీట్లు గెలుస్తాం. తమిళనాడులోనూ ఓటు షేర్ పెంచుకుంటాం. ఈసారి కేరళలో ఖాతా తెరుస్తాం. వచ్చే ఐదేళ్లలో దేశమంతటా ఉమ్మడి పౌరస్మతి అమలుచేస్తాం. మండే ఎండాకాలంలో కాకుండా వేరే కాలంలో ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అమలుచేస్తాం. సంబంధిత బిల్లునూ పార్లమెంట్‌లో ప్రవేశపెడతాం. ఆర్మీలో యువత కోసం అగి్నవీర్‌ను మించిన అద్భుత పథకం లేదు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత చక్కని ప్రతిభ కనబరిచిన వారికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఉంది కదా’’.
Comments
Please login to add a commentAdd a comment