డెహ్రాడూన్:ఉత్తరాఖండ్‌లో యూనిఫామ్ సివిల్‌కోడ్(యూసీసీ) జనవరి 27న అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా అన్ని మతాల్లోని వ్యక్తులకు వివాహం,ఆస్తిహక్కులు తదితర అంశాల్లో ఒకే రకమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏ మతంలోనూ బహుభార్యత్వాన్ని యూసీసీ అనుమతించదు. వీటికితోడు యూసీసీ కింద సహజీవనాలను సైతం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎవరైనా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే జంటలు దరఖాస్తు చేసుకుని తమ సహజీవనాన్ని నమోదు చేసుకోవాలి. అయితే సహజీవనాల నమోదుకు ఇప్పటివరకు 5 దరఖాస్తులు రాగా కేవలం ఒక సహజీవనం మాత్రమే రిజిస్టర్ అయింది. అయితే సహజీవనాల నమోదుకు పెద్దగా స్పందన లేదన్న వాదన కొంత మంది వినిపిస్తున్నారు.
దీనిని మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. చట్టంపై ప్రజల్లో అవగాహన రావడానికి సమయం పడుతుందంటున్నారు. సహజీవనాల నమోదుకు చాలా మంది ఇష్టపడడం లేదన్న వాదనా ఉంది. అయితే సహజీవనం నమోదు చేసుకోకపోతే యూసీసీ కింద జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సహజీవనాల నమోదును చాలా మంది వ్యతిరేకించినప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. శ్రద్దావాకర్ తరహా ఘటనలు పునరావృతం కావద్దంటే సహజీవనాల నమోదు తప్పనిసరన్న నిబంధనను తీసుకువచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment