
పిల్లాడిని రాజకీయాలకు వాడుకుంటారా?
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై మరోసారి రాజ్యసభలో దద్దరిల్లింది. ప్రతిపక్షాల తీరుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయ లబ్దికి వాడుకుంటున్నాయని విమర్శించారు. ''పిల్లాడిని రాజకీయాలకు వాడుకుంటారా.. చర్చ పెట్టండి అన్నీ తెలుస్తాయి'' అని మండిపడ్డారు.
రోహిత్ వేముల ఆత్మహత్యతో ప్రభుత్వానికి, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఏఐసీసీ నాయకుడు, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. రోహిత్ మృతిపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు.