
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు రిటైర్మెంట్ కోరుకోరని కాంగ్రెస్ సీనియర్ నేత గులాబ్ నబి ఆజాద్ అన్నారు. ఆయన బుధవారం సభలో మాట్లాడుతూ.. రాజ్యసభ కాల పరిమితి ముగిసిన ఎంపీలను గురించి పై విధంగా వ్యాఖ్యానించారు.
పదవీ కాలం ముగిసిన రాజ్యసభ సభ్యులను పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కలుస్తూనే ఉంటామని తెలిపారు. రిటైర్ అవుతున్న సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కే.పరసరన్, దిలీప్ కుమార్ టిర్కీ, సచిన్ టెండూల్కర్, కురియన్‌ల పదవీ కాలం నేటితో ముగియనున్నది.
Comments
Please login to add a commentAdd a comment