'వెండి పతకం వద్దు... గెలుపే ముద్దు' | Congress fighting to win, not for silver medal in Varanasi: Ghulam Nabi Azad | Sakshi
Sakshi News home page

'వెండి పతకం వద్దు... గెలుపే ముద్దు'

Published Sat, May 10 2014 6:18 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

'వెండి పతకం వద్దు... గెలుపే ముద్దు' - Sakshi

'వెండి పతకం వద్దు... గెలుపే ముద్దు'

వారణాసి: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వారణాసి ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ దీమా వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం తమ పార్టీ  అభ్యర్థే గెలుస్తాడని ఆయన చెప్పారు. గెలుపు కోసం తాము ప్రయత్నిస్తున్నామని, వెండి పతకం కోసం కాదని ఆయన  స్పష్టం చేశారు.

ప్రత్యర్థులు ఎంతటి బలవంతులైనా తాము భయపడబోమని తేల్చిచెప్పారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే ప్రచారం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన రోడ్ షోలో ఆజాద్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement