varanasi election
-
‘ఈవీఎం’ ఆరోపణలు.. ఈసీ కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని బుధవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపణలకు దిగింది. ‘ ట్యాంపరింగ్‌ను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయా? ఈ విషయంలో ఈసీ వివరణ ఇవ్వాల్సిందే’ అని ఎస్పీ ట్వీట్‌చేసింది. దీంతో మంగళవారం రాత్రి ఈవీఎంలను తరలించిన ఘటనలో వారణాసి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నళినికాంత్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. అయితే.. యూపీ పోలింగ్‌లో వాడిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి తరలిస్తున్నారంటూ ఒక వీడియోను ఎస్పీ బహిర్గతం చేయడం తెల్సిందే. ఈ వివాదంపై ఎన్నికల అధికారులు గురువారం స్పష్టతనిచ్చారు. ‘ అవి పోలింగ్‌లో వాడినవి కాదు. బుధవారం శిక్షణ కోసం వాడటం కోసం తీసుకెళ్తున్నారు. బుధవారం ఉదయం తరలించాల్సి ఉండగా ముందస్తు అనుమతిలేకుండా మంగళవారం రాత్రే తరలించారు. తరలింపులో నిర్లక్ష్యం వహించిన నళినికాంత్ సింగ్‌ను సస్పెండ్‌చేశాం’ అని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ గురువారం చెప్పారు. ఈ అంశంలో ఈసీకి ఫిర్యాదుచేస్తామని, కోర్టుకెళ్తామని ఎస్పీ ప్రకటించింది. కాగా, ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారిని మీరట్‌లో ప్రత్యేకాధికారిగా, బిహార్ ముఖ్య ఎన్నికల అధికారిని వారణాసిలో ప్రత్యేకాధికారిగా ఈసీ నియమించింది. సొంత వాహనంలోని ఓ పెట్టెలో బ్యాలెట్ పేపర్లు లభించడంతో సోన్‌భద్ర జిల్లా రిటర్నింగ్ అధికారి రమేశ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. మున్సిపాలిటీ చెత్తకుప్పలో బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రి లభించడంతో బరేలీ జిల్లా అదనపు ఎలక్షన్ ఆఫీసర్ వీకే సింగ్‌ను సస్పెండ్ చేశారు. చదవండి: పంచ తంత్రం.. గెలుపు ఎవరిదో? -
'వెండి పతకం వద్దు... గెలుపే ముద్దు'
వారణాసి: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వారణాసి ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ దీమా వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం తమ పార్టీ అభ్యర్థే గెలుస్తాడని ఆయన చెప్పారు. గెలుపు కోసం తాము ప్రయత్నిస్తున్నామని, వెండి పతకం కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థులు ఎంతటి బలవంతులైనా తాము భయపడబోమని తేల్చిచెప్పారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే ప్రచారం చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన రోడ్ షోలో ఆజాద్ పాల్గొన్నారు. -
'మోడీ ప్రత్యర్థులకు డిపాజిట్లు రావు'
వారణాసి: ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ దీమా వ్యక్తం చేశారు. మోడీకి లక్షల సంఖ్యలో మెజారిటీ వస్తుందన్నారు. మిగతా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. కాశీలో రాహుల్ గాంధీ నేడు నిర్వహించిన రోడ్ షోకు స్పందన అంతంత మాత్రంగానే ఉందని మరో బీజేపీ నేత షాహనాజ్ హుస్సేన్ ఎద్దవా చేశారు. రోడ్ షోకు వచ్చిన వారిలో ఏ మాత్రం ఉత్సాహం లేదన్నారు. నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారని చెప్పారు. -
మోడీ, కేజ్రీవాల్ అవకాశవాదులు: కాంగ్రెస్
వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్.. వారణాసికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ విమర్శించింది. వారిద్దరూ పచ్చి అవకాశవాదులని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుజ్రీవాలా దుయ్యబట్టారు. తమ అభ్యర్థి అజయ్ రాయ్ స్థానికంగా ప్రజాదరణ ఉన్న నాయకుడని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఒక లైనును పట్టుకుని ఆయనపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కాగా అజయ్ రాయ్‌కు నిశ్శబద్దంగా స్థానికులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని మరో కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జల్ అన్నారు.