బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్.. వారణాసికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ విమర్శించింది.
వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్.. వారణాసికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ విమర్శించింది. వారిద్దరూ పచ్చి అవకాశవాదులని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుజ్రీవాలా దుయ్యబట్టారు. తమ అభ్యర్థి అజయ్ రాయ్ స్థానికంగా ప్రజాదరణ ఉన్న నాయకుడని తెలిపారు.
రాహుల్ గాంధీ ప్రసంగంలోని ఒక లైనును పట్టుకుని ఆయనపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కాగా అజయ్ రాయ్కు నిశ్శబద్దంగా స్థానికులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని మరో కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జల్ అన్నారు.