బాన్సువాడ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే పుట్టిన బిడ్డ లాంటిదని, పెంచి పోషించాలంటే అమ్మలాంటి కాంగ్రెస్‌పార్టీయే అధికారం చేపట్టాలని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు చేసిన ఉద్యమమే కీలకమన్నా రు. పార్టీ ఎంపీలు తెచ్చిన ఒత్తిడితోనే తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం సైతం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు.
ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడలో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో ఆజాద్ మాట్లాడారు. తెలంగాణ సాధనకు ఎంపీ సురేశ్ షెట్కార్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆజాద్ వివరించారు. కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రభుత్వం రావాలంటే ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టాలన్నారు. బాన్సువాడ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్‌తో పాటు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులందరినీ గెలిపిస్తేనే తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ హిందువులు, ముస్లిం ల మధ్య చిచ్చు పెడుతోందని, దీన్ని తిప్పికొట్టాల న్నారు. ఆజాద్‌కు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆజాద్ రెండున్నర గంటలు ఆలస్యంగా రావడంతో సభకు హాజరైనవారు ఇబ్బం దులు పడ్డారు. సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువినయ్‌కుమార్, అలీబిన్ అబ్దుల్లా, మాసాని శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ యాదవ్, కిషో ర్ యాదవ్, ఖాలిఖ్, మీరా నసీముద్దీన్, అసద్‌బిన్ మోసిన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఉదయం 10.30 గంటలకు రా వాల్సిన ఆజాద్ బాన్సువాడకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. దీంతో పట్టణంలో నిర్వహించాల్సి న రోడ్ షోను రద్దు చేశారు. అనంతరం ఆయన నిజామాబాద్ నగరంలో జరిగిన మరో సభలో ఆజాద్ ప్రసంగించారు. బీజేపీకి ధనిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు సహకరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని మతాలను సమానంగా చూస్తుం దన్నారు. హిందువులు, ముస్లింలు రెండు కళ్లలాంటి వారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ బిడ్డకు కాంగ్రెస్ తల్లి కావాలి
Published Mon, Apr 28 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement