ఐడీ కార్డు లేకపోతే ఆజాద్ అయినా...
ఓటర్ గైడ్: ఓటర్ జాబితాలో పేరు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డు కాని, ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసైన్స్ లాంటి ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి కానీ లేకుండా ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించరు. గుర్తింపు కార్డు లేకుండా వెళ్లిన కేంద్ర మంత్రి ఆజాద్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. జమ్ము పార్లమెంటు స్థానానికి గురువారం(ఏప్రెల్10) జరిగిన పోలింగ్‌లో కేంద్ర మంత్రి గులాబ్ నబీ ఆజాద్ ఓటువేయడానికి వెళ్లారు. అయితే ఆయన తన ఓటరు గుర్తింపు కార్డును తీసుకెళ్లడం మరచి పోయారు. మీరు కేంద్ర మంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా ఓటరుగా వచ్చినప్పుడు గుర్తింపు కార్డు చూపాల్సిందే అని పోలింగ్ అధికారి పట్టుబట్టారు. చివరకు స్థానిక కాంగ్రెస్ నాయకుడు అజాద్ గుర్తింపుకు పూచీ వహించడంతో చివరకు ఎలాగోలా అజాద్ ఓటు వేయగలిగారు. కాబట్టి ఓటేసేందుకు వెళ్లేటప్పుడు ఓటరు గుర్తింపు కార్డు, అది లేకపోతే ఇతర ఏవైనా గుర్తింపు కార్డులు తీసుకెళ్లడం మరచిపోకండి.