కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల కౌంటింగ్‌ను ముందుగా పోస్టల్ బ్యాలెట్లతోనే ప్రారంభించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం లెక్కింపు చేపట్టాలని, దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి కౌం టింగ్ ప్రక్రియ ప్రారంభించాలని, ముం దుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని, కౌంటింగ్ సిబ్బందిని రాండమైజేషన్ ద్వారా కేటాయించాలని సూచించారు.
కౌంటింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లను నియమించాలని, అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులు సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఫలితాన్ని ప్రకటించిన తరువాత మా త్రమే ఈవీఎంలకు సీల్ వేయాలని అన్నారు. సమావేశంలో కలెక్టర్ జి.కిషన్, జేసీ పౌసుమిబసు, ట్రెయినీ కలెక్టర్ హన్మంతు, ఆర్డీఓ సురేంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌తోనే లెక్కింపు
Published Tue, May 13 2014 2:12 AM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM
Advertisement