
'మంత్రి వివరణ సంతృప్తికరంగా లేదు'
న్యూఢిల్లీ: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. అందుకే పార్లమెంట్ నుంచి తాము వాకౌట్ చేసినట్టు ఆయన వెల్లడించారు.
బ్లాక్ మనీ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ లో మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందేందుకు సహకరిస్తామని ఆజాద్ అన్నారు. కాగా, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువైతే పదవుల నుంచి తప్పుకునేందుకు సిద్ధమని గడ్కరీ ప్రకటించారు.