ఆ ముగ్గురూ ఇక్కడే.. | the three members are in ap | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురూ ఇక్కడే..

Published Sat, Apr 26 2014 3:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఆ ముగ్గురూ ఇక్కడే.. - Sakshi

ఆ ముగ్గురూ ఇక్కడే..

కీలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొని మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో అనుబంధం ఉన్న ముగ్గురు ఏఐసీసీ నేతలను తెలంగాణకు తరలించింది. దిగ్విజయ్, వయలార్ రవి, గులాంనబీ అజాద్ హైదరాబాద్‌లో మకాంవేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆజాద్ రోజుకు నాలుగు లేదా ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. శనివారం పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించేం దుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

జహీరాబాద్ సభలో కూడా పాల్గొంటానని నాయకులకు సూచించారు. 27న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, వనపర్తి, షాద్‌నగర్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు. అలాగే దిగ్విజయ్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటించేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. శనివారం ప్రధాని మన్మోహన్ హాజరుకానున్న భువనగిరి బహిరంగ సభలో పాల్గొననున్నారు. వయలార్ రవి మాత్రం హైదరాబాద్‌లో ఉండి ఎన్నికలప్రచార సరళి, అభ్యర్థుల వ్యవహారాలు, పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement