న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మందగమనం, ఆర్‌సెప్ ఒప్పందం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు వంటి వాటిపై ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. సోమవారం ఈ అంశంపై సీనియర్ ప్రతిపక్ష నేతల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు ఆజాద్, అహ్మద్ పటేల్, సుర్జేవాలా, ఆర్‌ఎల్‌ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం నుంచి టీకే రంగరాజన్‌తోపాటు ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, ఆర్‌ఎల్డీ నేతలు హాజరయ్యారు.
ఇది మా విజయమే: కాంగ్రెస్
ఆర్‌సీఈపీలో చేరబోవడం లేదని భారత్ ప్రకటించడం తమ విజయమేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ వ్యతిరేకించినందువల్లనే ప్రభుత్వం ఆ విషయంలో వెనకడుగు వేసిందని తెలిపింది. ఈ ఒప్పందం కుదిరితే రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయేవారని సూర్జేవాలా అన్నారు.
కేంద్రంపై ఉమ్మడి పోరాటం చేద్దాం
Published Tue, Nov 5 2019 4:03 AM | Last Updated on Tue, Nov 5 2019 4:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment